Home » చలికాలంలో ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి..!

చలికాలంలో ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి..!

by Anji

సాధారణంగా వర్షాకాలం, వేసవికాలం వంటి సీజన్లతో పోల్చుకుంటే శీతాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంల జలుబు, దగ్గుతో పాటు సీజనల్ వ్యాధులు సంభవిస్తుంటాయి. వీటిని దరి చేరకుండా ఉండేందుకు ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి.  అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లను దూరం చేసుకోవాలి. చలికాలంలో ఎసిడిటీ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆహారం అవసరమైన దాని కన్నా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా కొద్దిగా కష్టతరమవుతుంది. ఈ సమయంలో ఎసిడిటి, కడుపు ఉబ్బరం, తదితర సమస్యలు వస్తుంటాయి.

ఎందుకంటే మనం తినే ఆహారం అన్నవాహిక నుంచి నేరు కడుపులోకి వెళ్తుంది. దీంతో కడుపు పై బాగానికి యాసిడ్ పెరుగుతుంది. ఫలితంగా గుండెల్లో మంట తదితర సమస్యలు వస్తుంటాయి. జీర్ణ సమస్యలున్న వారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెంచ్, ఫ్రైస్, చిప్స్ ఎక్కువగా తినడంతో ఎసిడిటి సమస్య వచ్చే అవకాశం ఉంది. వేయించిన ఆహార పదార్థాలను పూర్తి దూరం పెట్టడం ఉత్తమం. అదేవిధంగా మసాలా దినుసులతో తయారు చేసిన ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. 

Manam News

ఫైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. జీర్ణక్రియలో పైనాపిల్ సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది ఎసిడిటిని కలిగిస్తుంది. కాబట్టి శీతాకాలంలో ఎసిడిటి సమస్య ఉన్న వారు ఫైనాపిల్ తినకపోవడమే మంచిది. అలా అని అందరికీ ఈ సమస్య ఉండదు. కొంత మందికి మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంది. 

Also Read :  ఇంట్లో ఉన్న దోమలు ఎలాంటి కెమికల్స్ వాడకుండా పరార్.. ఎలాగంటే..?

Manam News

చలికాలంలో మార్కెట్ లో నిమ్మకాయలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయలతో పాటు నారింజ, బత్తాయి వంటి పండ్లు కూడా ఉంటాయి. శీతాకాలంలో నిమ్మకాలతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ నిమ్మకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఎసిడిటి సమస్య తలెత్తుతంది. కాబట్టి నిమ్మకాయల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. 

manam News

చాలా మంది కెచప్, టొమాటో సాస్ ని వేయించిన ఆహారంతో కలిపి తీసుకుంటారు. చిన్న పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు. ఈ సాస్ లో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. మోతాదుకి మించినటువంటి రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని కూడా వీలైనంత వరకు దూరం పెట్టడం ఉత్తమం. లేదంటే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే జాగ్రత్త..!

Also Read :  టీ లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఈ సమస్యలు దరి చేరవు..!

 

Visitors Are Also Reading