Telugu News » Blog » ఒక్క‌ సినిమా 13 అవార్డులు.. కానీ అభిన‌య ప‌డిన క‌ష్టాలు చూస్తే క‌న్నీళ్లే..!

ఒక్క‌ సినిమా 13 అవార్డులు.. కానీ అభిన‌య ప‌డిన క‌ష్టాలు చూస్తే క‌న్నీళ్లే..!

by Anji
Ads

తెలుగు, త‌మిళ సినిమాల్లో త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది అభిన‌య‌. ఆమె పుట్టుక‌తోనే చెవిటి, మూగ. వారి త‌ల్లిదండ్రులు ఆవిడ‌ను ఎలాగైనా మాట్లాడించాల‌నే త‌ప‌న వారి బంధువుల వ‌ద్ద‌.. స్నేహితుల ద‌గ్గ‌ర కలిపి ఏకంగా 11ల‌క్ష‌ల వ‌ర‌కు వారి కోసం అప్పుతీసుకొచ్చి త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు. అభిన‌య‌కు హైద‌రాబాద్‌లో స్పీచ్ థెర‌పీ క్లాస్‌లు కూడా ఇప్పించారు. అంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టిన కానీ ఎలాంటి ఫ‌లితం ద‌క్క‌లేదు. పేరుకు త‌గ్గ‌ట్టుగానే అభిన‌య న‌ట‌న‌లో అభిన‌యం ఏమాత్రం త‌గ్గించేది కాదు.

Advertisement

Also Read: టాలీవుడ్ సెలబ్రటీల ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఇవే…ఎక్కువ మందికి అదే ఇష్టమట…!

Abhinaya Height, Weight, Age, Wiki, Biography, Husband, Affair, Family

అభిన‌య ఏడ‌వ‌త‌ర‌గ‌తిలో ఉండ‌గానే.. ఓ త‌మిళ సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఆ త‌రువాత ఆవిడ‌కు ఎలాంటి సినిమాల్లో న‌టించ‌డానికి అవ‌కాశం రాలేదు. ఆమె విన‌లేక‌పోవ‌డం, మాట్లాడ‌లేక‌పోవ‌డం మూలంగా అభిన‌య‌కు అవ‌కాశాలు రాలేద‌ని చెప్పొచ్చు. ఆమెకు ఉన్న‌ న‌టన ప‌ట్ల ఆస‌క్తిని గ్ర‌హించిన తండ్రి యాడ్స్‌లోఐనా న‌టింప‌జేయాల‌ని ప్ర‌య‌త్నించాడు. యాడ్స్ లో అయితే మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు కాబ‌ట్టి ఆవిడ‌ను న‌టించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. ఆ విధంగా ప‌లు యాడ్స్‌ల‌లో న‌టించింది.

Abhinaya excited with her B'wood debut through Balki's 'Shamitabh' | Bollywood News – India TV

Advertisement

అయితే ఆమె తండ్రికి కూడా న‌ట‌న ప‌ట్ల ఇష్టం ఉండ‌డంతో సినిమాల్లో న‌టించేందుకు ఆర్టిస్ట్‌గా ట్రై చేసేవారు. ఆయ‌న వెళ్లిన ప్ర‌తిచోట త‌న‌తో పాటు కూతురు ఫొటోల‌ను కూడా ఇచ్చేవారు. ఫొటోలో అభిన‌య న‌వ్వు చూసిన వారు అమ్మాయి భ‌లే ఉంద‌నే వారు. మాట‌లు రావు అని తెలియ‌డంతో ముఖం చిట్టించేవారు. ఇదిలా ఉండ‌గానే.. ‘నాదోదిగ‌ల్’ అనే సినిమా కోసం ఓ ముంబై సెల‌క్ట్ చేసుకున్నారు. ఆవిడ‌కు త‌మిళం మాట్లాడ‌టం క‌ష్టం కావ‌డంతో నేను న‌టించ‌ను అని వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు కొప్ప‌డి ఎలాగైనా అస‌లు క‌మ్యూనికేష‌న్ తెలియ‌ని హీరోయిన్‌ను న‌టింప‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టిక‌ప్పుడు అభిన‌య‌ను తీసుకొచ్చి వెండితెర‌కు ప‌రిచ‌యం చేశాడు.

Kollywood actress Abhinaya's big Bollywood debut

ఆ సినిమా భారీ విజ‌యం అందుకుంది. ఒకే సినిమాకు ఏకంగా 13 అవార్డులు ల‌భించాయి. ఇదే సినిమాను తెలుగులో శంభోశివ‌శంబోగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించింది అభిన‌య‌నే. ఆ త‌రువాత క‌న్న‌డంలో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అభిన‌య చెవిటి, మూగ కావ‌డంతో కావ‌డంతో ఎలా న‌టించింది అనే అనుమానం రావ‌చ్చు. అయితే ఆవిడ చెప్పాల్సిన డైలాగులు ముందుగానే ద‌ర్శ‌కుడు త‌ల్లిదండ్రుల‌కు చెప్పేవాడు. దీంతో త‌న కూతురుకు సైగ‌ల ద్వారా చూపించారు. సింగిల్ టేక్‌లోనే అభిన‌య త‌న డైలాగ్‌ల‌కు త‌గిన ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ న‌టించేది. ఆమె న‌టించిన మొద‌టి సినిమాకే తెలుగు, త‌మిళంలో క‌లిపి రెండు ఫిలిం ఫెయిర్ అవార్డుల‌ను అందుకున్న‌ది. తెలుగులో శంభోశివ‌శంబో, ద‌మ్ము, ఢ‌మ‌రుకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు వంటి సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అత్యంత చేరువైంది అభిన‌య‌.

Advertisement

Also Read: సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డానికి ముందే ఊహించ‌ని ప్ర‌మాదాలు.. ఏమిటంటే..?