Telugu News » సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డానికి ముందే ఊహించ‌ని ప్ర‌మాదాలు.. ఏమిటంటే..?

సౌంద‌ర్య మ‌ర‌ణించ‌డానికి ముందే ఊహించ‌ని ప్ర‌మాదాలు.. ఏమిటంటే..?

by Anji

అనతి కాలంలోనే న‌ట‌న‌లో సౌంద‌ర్య త‌న‌దైన ముద్ర‌వేశారు. అభిన‌యానికి ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను పోషించింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి కాక‌పోయినా తెలుగు అమ్మాయి మాదిరిగా సౌంద‌ర్య పాపులారిటీని సంపాదించుకుని ఎంద‌రో అభిమానుల హృద‌యాల‌లో చోటు సంపాదించారు. కొన్ని సంవ‌త్స‌రాల్లోనే వంద‌కు పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించారు.

Ads

Also Read: ఒక్క‌ సినిమా 13 అవార్డులు.. కానీ అభిన‌య ప‌డిన క‌ష్టాలు చూస్తే క‌న్నీళ్లే..!

Actress Soundarya pregnant when she died in helicopter crash?

వివాదాల‌కు దూరంగా ఉండే సౌంద‌ర్య ఇత‌ర స్టార్ హీరోయిన్ల‌తో కూడా ఆమె ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ట‌. సౌంద‌ర్య మృతి చెంద‌డంతో కొన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోగా.. మ‌రికొన్ని ప్రాజెక్టులు ఆమె న‌టించాల్సిన సీన్లు లేకుండానే విడుద‌ల‌య్యాయి. సౌంద‌ర్య మృతి చెంది 17 ఏండ్లు గ‌డిచినా అభిమానుల హృద‌యాల్లో మాత్రం ఆమె జీవించే ఉన్నారు. 2004 సంవ‌త్స‌రంలో విమాన ప్ర‌మాదంలో మృతి చెందారు. ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుల‌లో ఒక‌రైన మాన‌వ కోటేశ్వ‌ర‌రావు ఓ ఇంట‌ర్వ్యూలో సౌంద‌ర్య గురించి కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

సౌందర్య చనిపోవడానికి ముందే ఊహించని ప్రమాదాలు జరిగాయట.. ఏమైందంటే

నిడివి ఎక్కువ‌గా ఉన్న పాత్ర‌ల్లో తాను న‌టించ‌క‌పోవ‌డానికి గ‌త కార‌ణాల గురించి మాన‌వ కోటేశ్వ‌ర‌రావు మాట్లాడారు. కొన్ని పాత్ర‌ల‌లో న‌టించాలంటే త‌న‌కు భ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఔట్‌డోర్ షూటింగ్‌లు ఎక్కువ రోజులుంటే కూడా తాను ఆ సినిమాల్లో న‌టించేవాడిని కాదు అని పేర్కొన్నారు. శివ్‌శంక‌ర్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో లైట్ మ్యాన్ పై నుంచి సౌంద‌ర్య ఎక్క‌డైతే కూర్చున్నారో అక్క‌డ ప‌డ్డారు అని తెలిపారు.

సౌందర్య చనిపోవడానికి ముందే ఊహించని ప్రమాదాలు జరిగాయట.. ఏమైందంటే

ముఖ్యంగా పై నుంచి వ‌చ్చే శబ్దం విని ఆమె ప‌క్కకు వెళ్లారు అని, 17 అడుగుల నుంచి ఆ వ్య‌క్తి కింద ప‌డ్డాడు అని కోటేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆ స‌మ‌యంలో మ‌రొక రెండు చోటు చేసుకున్న‌ట్టు చెప్పారు. సౌంద‌ర్య మృతి చెంద‌డానికి కొద్ది రోజుల ముందే ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. సౌంద‌ర్య న‌టించిన సినిమా శివ‌శంక‌ర్ సినిమా కాగా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాఫ్‌గా నిలిచింది. ఈ సినిమామో మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన విష‌యం తెలిసిందే.


You may also like