Home » కేసీఆర్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు.. ఒక్క కారు, గుంట భూమి కూడా లేదు..!

కేసీఆర్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు.. ఒక్క కారు, గుంట భూమి కూడా లేదు..!

by Anji
Ad

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు నవంబర్ 10 చివరి తేదీ  అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పలువురు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముఖ్యంగా ఈటల రాజేందర్, మంత్రి మల్లారెడ్డిలు ఒక్క కారు కూడా లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ లో కూడా ఒక్క కారు కూడా లేదని పేర్కొనడం గమనార్హం. కేసీఆర్ అఫిడవిడ్ లో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సీఎం కేసీఆర్ కి కారుతో పాటు ఒక్క సెంట్ భూమి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాలు ఎవ్వరో చెప్పినవి కాదండోయ్..  స్వయంగా సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.  ఇవాళ కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్న విషయాలు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా తాను కూడా  వ్యవసాయం చేస్తానని.. తాను పెద్ద కాపు అని చెప్పుకొనే కేసీఆర్..  తన పేరు మీద ఎలాంటి భూమి లేకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Advertisement

కేసీఆర్ కి ఆస్తులు ఏమి లేవని కాదండోయ్.. కేసీఆర్ పేరు మీద ఎలాంటి భూములు లేకపోయినా.. ఉన్న స్థలాలను కుటుంబ ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయట. అయితే కేసీఆర్ కుటుంబానికి మొత్తం 53.30 ఎకరాల సాగు భూములు, 9.36 ఎకరాలు వ్యవసాయేతర భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. 4 నెలల కిందటే జులైలో మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో 10 ఎకరాల సాగుభూమిని కేసీఆర్ కుటుంబం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు 28.47 లక్షలుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కి రూ.17.83 కోట్ల విలువైన స్థిర ఆస్తులు. రూ.9.67 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించారు. ఉమ్మడి ఆస్తిా రూ.9.81 కోట్ల వరకు చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. కేసీఆర్ పేరిట రూ.17.27 కోట్ల అప్పు ఉండగా.. ఆయన కుటుంబానికి రూ.7.23 కోట్ల అప్పులు ఉన్నట్టు అఫిడవిట్ లో స్పష్టం చేశారు.

కేసీఆర్ పేరిట 9 బ్యాంకు అకౌంట్లు, శోభ పేరు మీద 3 ఖాతాలున్నట్టు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ బ్యాంకు డిపాజిట్లు మాత్రం రెట్టింపు అయ్యాయి. 2018 ఎన్నికల సమయానికి కేసీఆర్ పేరిట బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి మొత్తం రూ.5.63 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తం రూ.11.16 కోట్లు అయింది. కేసీఆర్ చేతిలో ఇప్పుడు కేవలం 2లక్షల 96వేలున్నట్టు తెలిపారు. తన భార్య శోభ చేతిలో 2018లో సుమారు రూ.94వేల వరకు నగదు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.6.29 కోట్లున్నట్టు తెలిపారు. బంగారు ఆభరణాలు 2.8 కిలోలున్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కి సొంతంగా కారు, ద్విచక్ర వాహనం లేకపోయినా.. వ్యవసయానికి వినియోగించే ట్రాక్టర్లు హార్వెస్టర్లు, జేసీబీ లాంటివి మొత్తం 14 వాహనాలు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు 1కోట 16 లక్షలుగా పేర్కొన్నారు. కేసీఆర్ మీద ఉద్యమం సమయంలో నమోదు అయినటువంటి 9 కేసులున్నట్టు కూడా తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 

మరిన్నీ తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి

Visitors Are Also Reading