Home » కైకాల సత్యనారాయణ కొడుకుని ఎప్పుడైనా చూసారా ..వీరి జీవితం ప్రతి ఒకరికి ఆదర్శం !

కైకాల సత్యనారాయణ కొడుకుని ఎప్పుడైనా చూసారా ..వీరి జీవితం ప్రతి ఒకరికి ఆదర్శం !

by Anji
Ad

తెలుగు సినీ నటుడు, భారత మాజీ పార్లమెంట్ సభ్యుడు కైకాల సత్యనారాయణ. దాదాపు 40 ఏళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సేవ చేసిన కైకాల ఇప్పటివరకు 777 కి పైగా చిత్రాల్లో నటించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రలు చేశాడు. అదేవిధంగా హాస్య, ప్రతినాయక వంటి పాత్రలెన్నింటినో పోషించాడు. తాను పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదు పొందారు. తన గంభీరమైన గాయంతో కంఠంతో సినిమాల్లో వేశాల కోసం సత్యనారాయణ భద్రాద్రి వెళ్లారు.  ఆయనను మొదట గుర్తించి సీ.ఎల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఓ పాత్ర ఇచ్చారు.

Also Read :  ఎం ఎస్ నారాయణ కొడుకుకి టాలీవుడ్ లో ఘోర అవమానం .! ఛాన్స్ కోసం వెళితే..!

Advertisement

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినప్పటికీ సత్యానారాయణ ప్రతిభను గుర్తించారు. ఆయన రూపు రేఖలు ఎన్టీఆర్ ని పోలి ఉండడమే. సత్యనారాయణ ఇండస్ట్రీలోకి రావడంతో ఎన్టీఆర్ కి మంచి నకలు దొరికినట్టయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా సత్యనారాయణను గమనించాడు. 1960లో ఎన్టీఆర్ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో సత్యనారాయణ యువరాజు పాత్రలో నటించాడు. సత్యనారాయణను ఒక ప్రతినాయకుడిగా చిత్రికరించవచ్చని కనిపెట్టింది మాత్రం విఠాలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది.  ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే.. సత్యనారాయణ క్యారెక్టర్ పాత్ర కూడా వేశాడు. ముఖ్యంగా సత్యనారాయణ వేయని పాత్ర అంటూ లేదు. యమగోల, యమలీల చిత్రంలో యముడుగా అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో.. యముడిగా సత్యనారాయణ అలా. ఎస్వీ రంగారావు కనిపించిన పాత్రల్లో చాలా వరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో దానవుడు, దుర్యోదనుడు, యముడు, ఘటోత్కచుడు.. సాంఘికాల్లో  రౌడీ, తండ్రి, మామ, తాత వంటి తదితర పాత్రలు పోషించారు. 

Advertisement

Also Read :  అప్పట్లో ఎన్టీఆర్ కి సాధ్యమైన రికార్డు మళ్ళీ బాలకృష్ణ సాధించారా ? కేవలం నందమూరి వారికే సొంతం !

Manam News

రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలు నిర్మించారు. ఇక సత్యనారాయణ కుటుంబం విషయానికొస్తే.. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. సినిమాల్లో తన నటన వారసత్వం పిల్లలు ఏ మాత్రం అందిపుచ్చుకోలేేదు. వారి సొంత కాళ్ల మీద నిలబడడమే ముఖ్యమని భావించాడు. కూతుర్ల ఇద్దరి పెళ్లిలు చేసి కొడుకులిద్దరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.  ఇద్దరు కుమారులు కూడా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ కూడా సత్యనారాయన కొడుకులు మీడియా కంట పడలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కేజీఎఫ్ వంటి హిట్ మూవీని కైకాల సత్యనారాయణ కుమారుడు తెలుగులో డబ్బింగ్ రైట్స్ ని దక్కించుకొని అందరినీ ఆకర్షించాడు. ఇన్నాళ్లకు కైకాల కుమారుడు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఆయన అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది.  ఆ సమయంలో కైకాల సత్యనారాయణ తన కుమారుడి గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read :  దర్శకుడి మాటలు వినక అట్టర్ ప్లాప్ అయినా మెగా స్టార్ సినిమా ఏది ? ఎందుకు చిరు వినిపించుకోలేదు ?

Visitors Are Also Reading