Home » పవన్ కళ్యాణ్ నుంచి నిహారిక వరకు.. మెగాఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకుంది వీరే!

పవన్ కళ్యాణ్ నుంచి నిహారిక వరకు.. మెగాఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకుంది వీరే!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు కులం కంటే ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ లో కూడా ఇలాంటి వివాహాలు ఎక్కువే ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్యామిలీకి సంబంధించి ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. చిరు, చరణ్, పవన్, అల్లు అర్జున్ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో బద్దలు కొట్టేస్తున్నారు.

వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ లు మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఒక్కోసారి కులం ప్రస్తావనలు తీసుకొచ్చి మరీ కామెంట్స్ లో తిట్టుకుంటూ ఉంటారు. కానీ, వారికి కులంపై ఎలాంటి ఆసక్తులు లేవని వారి ఫ్యామిలీలో జరిగిన పెళ్లిళ్లు చూస్తే తెలుస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువ కులాంతర వివాహాలు జరిగింది కూడా మెగా ఫ్యామిలీలోనే. ఇంతకీ ఎవరెవరు కులాంతర వివాహాలు చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

Advertisement

పవన్ కళ్యాణ్:


పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు కులాంతర వివాహాలే. మొదటి భార్య నందినిని విశాఖపట్నంలతోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌ కలిసిన పవన్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2008 లో వీరు విడిపోయారు. తర్వాత రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ అమ్మాయి. బద్రి మూవీ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. వీరు కూడా విడాకులు తీసుకున్నారు. తరువాత రష్యన్ అమ్మాయి అన్నా లెజినోవా ను పవన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు.

శ్రీజ:

Advertisement


చిరు చిన్న కూతురు శ్రీజ మొదటి వివాహం అప్పట్లో సంచలనం సృష్టించింది. బ్రాహ్మణ కుర్రాడు శిరీష్ భరద్వాజ్‌ను శ్రీజ ప్రేమించి ఆర్య సమాజ్ లో పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఎక్కువకాలం నిలవలేదు. వీరికి ఆడబిడ్డ పుట్టిన తరువాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. 2016లో శ్రీజ ను కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి పెళ్లి చేసారు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆడపిల్ల పుట్టిన తరువాత గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

అల్లు అర్జున్:


బన్నీ స్నేహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేసీ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహాను బన్నీ ప్రేమించారు. వీరిది కూడా కులాంతర వివాహమే.

రామ్ చరణ్:


రామ్ చరణ్, ఉపాసనలది కూడా కులాంతరమే. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీరి పెళ్లి కూడా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ఫ్యాన్స్ లోను షాక్ ని నింపింది.

నిహారిక:

niharika
నిహారికకు జొన్నల గడ్డ చైతన్యకు ఘనంగ పెళ్లి జరిపించారు. వీరిది కూడా కులాంతర వివాహమే. అయితే.. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇటీవలే వీరు విడాకులు తీసుకున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య:


వరుణ్ లావణ్యలు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వీరు ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిది ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading