Home » Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

by Bunty
Ad

టీమిండియా స్టార్ క్రికెటర్, రాజస్థాన్ టీం కెప్టెన్ సంజు శాంసన్ గురించి, అతని ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కీపర్ గా, బ్యాట్స్మెన్ గా అలాగే కెప్టెన్ గా బాగా సక్సెస్ అయ్యాడు సంజు శాంసన్. కానీ టీమిండియాలో మాత్రం సంజు శాంసన్ కు అసలు చాన్సులు రావడం లేదు. ఇలాంటి తరుణంలోనే తాజాగా టీమిండియా నుంచి సంజు శాంసన్ కు పిలుపు వచ్చింది. వచ్చేనెల ప్రారంభం నుంచి వెస్టిండీస్ టూర్ కు టీమిండియా వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Advertisement

అక్కడ జరిగే వన్డే సిరీస్ కు.. ఎంపికైన సంజు… ఏడు నెలల తర్వాత టీమిండియాలోకి రియంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో అతని ఫాన్స్ ఫుల్ కుశిలో ఉన్నారు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంజు శాంసన్ కు మరో అదిరిపోయే ఆఫర్ వచ్చింది. టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్… ఇటీవల వెన్ను నొప్పితో ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. తీవ్ర వెన్ను నొప్పితో అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతని వెన్నుపూసకు ఆపరేషన్ కూడా అయినట్లు తెలుస్తోంది.

Advertisement

దీంతో అతడు కోల్పోవడానికి మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. వన్డే వరల్డ్ కప్ వరకు అతడు ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆగస్టు 31 తర్వాత జరిగే ఆసియా కప్ కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్…. టీమిండియా కు దూరమైతే అతని స్థానంలో సంజు శాంసన్ కు బీసీసీఐ చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరగాలంటే వెస్టిండీస్ టూర్ లో… సంజు కచ్చితంగా రాణించాల్సిందే. కాబట్టి సంజు శాంసన్ కు ఇప్పుడు మంచి ఆఫర్ వచ్చినట్లు అయింది. మరి దీన్ని సంజు శాంసన్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading