Home » భారత కెప్టెన్ గా పంత్.. సిరీస్ కు రాహుల్ దూరం..!

భారత కెప్టెన్ గా పంత్.. సిరీస్ కు రాహుల్ దూరం..!

by Azhar
Ad

ఈ నెల 9 నుండి భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీలకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. అందుకే ఈ జట్టును నడిపే బాధ్యతలను కేఎల్ రాహుల్ చేతికి అప్పగించింది. కానీ ఇప్పుడు రాహుల్ గాయంబారిన పడ్డాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించింది.

Advertisement

గాయం కారణంగా కేఎల్ రాహుల్ పూర్తిగా ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ కు దూరం అయ్యాడు అని తెలిపింది. అందుకే వైస్ కెప్టెన్ గా ఉన్న పంత్ కు భారత కెప్టెన్సీ పగ్గాలు అందించాలని కమిటీ నిర్ణయించినట్లు అందులో తెలిపింది. అలాగే ఐపీఎల్ లో కెప్టెన్ గా అదరగొట్టి తన జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యకు వైస్ కెప్టెన్ గా నియమిస్తున్నట్లు తెలిపింది. అలాగే అయితే కుల్దీప్ యాదవ్ గత సాయంత్రం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని కుడి చేతికి దెబ్బ తగలడంతో అతను కూడా ఈ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు అని ప్రకటించింది.

Advertisement

అయితే ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు గాయంతో దూరం అవ్వడం వల్ల వారి స్థానాల్లో మరెవరినైనా జట్టుకు బీసీసీఐ ఎంపిక చేస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఇక ఇప్పుడు భారత జట్టు కెప్టెన్ గా వ్యవరించనున్న పంత్ కు కేవలం రెండు ఐపీఎల్ సీజన్ లలో కెప్టె గా చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఇదే పంత్ మొదటిసారి జాతీయ జట్టును నడిపించడం. కాబట్టి పంత్ ను భవిష్యత్ కెప్టెన్ చేయాలనే వాదనలు ఆమధ్య ఇప్పుడు తాను జట్టును ఎలా నడిపిస్తాడు అనే ఆసక్తి అందర్లోనూ పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి :

టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా కావాలంటున్న…

చాహల్ మొదటి ప్రేమ గురించి భార్య ధనుశ్రీ కామెంట్స్..!

Visitors Are Also Reading