Home » ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి అధికార యోగముంటుంది

ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి అధికార యోగముంటుంది

by Anji
Ad

ప్రస్తుతం స్వక్షేత్రాలలో ఉన్న శని, గురువులకు తోడు, రవి ఉచ్ఛ స్థానంలోకి రావడం కొన్ని రాశుల వారి జీవితాలను సానుకూల మలుపుతిప్పబోతుంది. రవి ఉచ్ఛ స్థితిలోకి రావడం వల్ల ప్రధానంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభరాశుల వారికి అధికార యోగం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. వాస్తవానికి ఈ రాశుల వారికి మీనంలో ప్రవేశించిన దగ్గర నుంచి అనగా మార్చి 16 నుంచి మే 16 వరకు శుభఫలితాలు అనుభవంలోకి వస్తాయి. సానుకూల ప్రభావం ఏప్రిల్ నెలలో సంబంధిత రాశులకు స్పష్టం కనిపించే అవకాశముంది. ఈ రాశుల వారికి రెండు నెలల పాటు ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి

Advertisement

మేషరాశి :

మేషరాశి వారికి తప్పనిసరిగ్గా అధికార యోగం పట్టే అవకాశముంది. రవిగ్రహం మేషరాశిలో ఉచ్ఛ స్థానానికి చేరుకోవడం వల్ల ఈ రాశివారి జీవితాల్లో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడం, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. సంతాన యోగానికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

మిథునరాశి  :

ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి సంచరించడం వల్ల ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా పురోగతి చెందడానికి మార్గం చాలా సుగమం అవుతుంది. దీంతో ఆదాయం పెరగడం, లాభాలు రెట్టింపు కావడం చాలా జరుగుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరి పురోగతి వేగం పుంజుకుంటుంది. జీవితంలో ఎన్నో ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్యం నుంచి అతివేగంగా కోల్కునే అవకాశముంది. 

Advertisement

కర్కాటక రాశి  :

ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి ప్రవేశిస్తున్నందున ఉద్యోగ పరంగా కెరీర్ పరంగా జీవితం గొప్ప మలుపు తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం చేపట్టే సూచనలున్నాయి. ప్రభుత్వ సంబంధమైన సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. రాజకీయ ప్రవేశానికి అవకాశముంది. బంధు వర్గంలో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయి. వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. 

సింహరాశి  : 

ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి రవి నవమ రాశిలో ప్రేవేశించడం అనేది శుభయోగాలకు దోహదం చేస్తుంది. విదేశీ యానానికి, విదేశీ చదువులకు, విదేశాల్లో స్థిరపడటానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎదురుచూస్తున్న వారికి ఆటంకాలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వారసత్వ సంపద చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

కుంభరాశి :

ఈ రాశి వారికి మూడో స్థానమైనటువంటి మేషరాశిలోకి రవి ప్రవేశించడం వల్ల ఊహించని అదృష్టాలను తెచ్చిపెడుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. తోబుట్టువులతో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. మిత్రులకు వీలైనంత సహాయపడటంతో పాటు వారి అభివృద్ధికి చేయూతనివ్వడం జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరడం వంటివి జరిగే సూచనలున్నాయి. 

Also Read :  ఈ వేరు దొరికితే వదలకండి.. దీంతో కోటీశ్వరులు అవుతారు..!

Visitors Are Also Reading