Weekly Rasi Phalau in Telugu 2023 : రాశిఫలాలు చదవడం వల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది. ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 19.03.2023 నుంచి 25.03.2023 వరకు మేషం :
Mesha
కేవలం రెండు ముఖ్యమైన పనులు మాత్రమే సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఆచితూచి ఖర్చు చేయడం చాలా ఉత్తమం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొందరూ చిన్నప్పటి స్నేహితులను కలుస్తారు.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
Weekly Rasi Phalau in Telugu
ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశముంది. బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తి గత విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
మీ ఉద్యోగ జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చక్కబడుతుతుంది. ప్రధాన సమస్య నుంచి అనుకోకుండా బయటపడుతారు. ఆరోగ్యం చాలా నిలకడగా ఉంటుంది. ఇతరులకు శక్తికి మించిన సహాయం చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశముంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యల నుంచి బయటపడుతారు. ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొందరూ దగ్గర బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు ఉన్నా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరముంది. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. భాగస్వాములతో వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
Thula
ఆర్థిక విషయాల్లో సమయం సానుకూలంగా ఉంది. అత్తింటి కుటుంబం నుంచి చేదు వార్త వినే అవకాశముంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఓ మెట్టు పైకి ఎదిగే సూచనలున్నాయి. సామాజిక రంగంలోని వారికి గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఓ దానికి పరిష్కారమవుతుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.
Advertisement
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆదాయానికి సంబంధించిన పనులు మాత్రం విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలను విజయవంతంగా పూర్తవుతాయి.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
విదేశాలలో ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. కొందరూ మిత్రులు అండగా నిలబడి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. బంధువులతో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కొందరూ బంధువులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. ప్రాంతంలో ఓ మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. ఒత్తిడి పెరిగిపోయినప్పటికీ ముఖ్యమైన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పుడతాయి. వస్తువులు కానీ, డబ్బు కానీ నష్టపోయే అవకాశముంది. ప్రయోజనం లేని పనులను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చాలా తేలికగా విజయాలను సాధిస్తారు.