Home » ఆ స్టార్ హీరోయిన్ అన్న‌తో ఇలియానా ల‌వ్‌ ఎఫైర్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

ఆ స్టార్ హీరోయిన్ అన్న‌తో ఇలియానా ల‌వ్‌ ఎఫైర్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

by Anji
Ad

దేవదాస్ సినిమాతో తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమా తోనే తన అందాల ఆరబోతలో కాప్ లెవెల్ లో మార్కులు కొట్టేసింది ఈ భామ. వరుసగా ఆఫర్లను పట్టేసింది. పోకిరి , కిక్ వంటి హిట్ సినిమాలతో స్టేటస్ సంపాదించుకుంది. ఇక టాలీవుడ్‌లో మెల్ల‌మెల్ల‌గా అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతుండ‌డం గ‌మ‌నించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌పై క్రేజ్ తో బీ టౌన్ చెక్కేసింది. అక్క‌డ త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అనుకున్నంత మేర రాణించలేకపోతోందని చెప్పుకోవ‌చ్చు.

Advertisement

ఇదిలా ఉంటే.. ముఖ్యంగా ఇలియానా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటుంది. డేటింగ్ చేయడంలో యమ స్పీడుగా ఉండే ఈ భామ.. మొదట విదేశీయుడు ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిన‌దే. పీకల్లోతూ ప్రతిమలో మునిగితేలిన ఈ ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు టాక్ వినిపించింది. ఇంత‌లోనే వీరి బందం బ్రేకప్ కావడం, ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ కారణంగా కొన్నాళ్లపాటు పినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇలియానా తిరిగి మెల్లమెల్లగా యాక్టివ్ అవుతూ వ‌స్తోంది.

Advertisement


తాజాగా మ‌రోసారి డేటింగ్ ఇష్యూ తో వార్తల్లో నిలిచింది. ఓ స్టార్ హీరోయిన్ సోదరుడు తో ఆమె డేటింగ్ చేస్తోందని, సీక్రెట్ గా ఎఫైర్ కూడా నడుస్తోందని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కత్రినా కుటుంబ సభ్యులతో కలిసి ఇలియానా ఇటీవలే టూర్ కి వెళ్లడం, అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడంతో ఇలియానా కొత్త తోడు విషయం ఇప్పుడు హ‌ట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మ‌డి సీక్రెట్ ఎఫైర్ వార్తలకు బలం చేకూరింది.

ఇటీవ‌ల జ‌రిగిన క‌త్రినా బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఇలియానా పాల్గొన్న‌ది. జులై 16న మాల్దీవుల్లో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో క‌త్రినా భ‌ర్త విక్కీ కౌశల్, ఇలియానా, సెబాస్టియన్, సన్నీ కౌశల్, సర్వరీ వఘ్ పాల్గొన్నారు. ఇక్కడ అందరితో కలిసి ఓ పిక్ తీసుకుంది ఇలియానా. ఈ పిక్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. సూర్యోదయం, కాక్ టైయిల్స్, కొంచెం బర్త్డే కేక్ అనే కాప్షన్ ఇచ్చింది గోవా బ్యూటీ. ఇందులో సెబాస్టియన్ కూడా ఉండడంతో ఇలియానా డేటింగ్ ఇష్యూ కాస్త వైరల్ గా మారింది. ఈ ఇష్యూ ఎంత వ‌ర‌కు వెళ్తుందో వేచి చూడాలి మ‌రి.

Also Read : 

ప్రభాస్ ఫామ్ హౌస్ ల విలువ అంతా…?

వివి.నాయక్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి కొడాలి నాని ఎందుకు అడ్డుపడ్డారు…. ఇంట్రెస్టింగ్ స్టోరీ….!

Visitors Are Also Reading