Home » ప్రభాస్ ఫామ్ హౌస్ ల విలువ అంతా…?

ప్రభాస్ ఫామ్ హౌస్ ల విలువ అంతా…?

by Azhar
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే బాహుబలి అనే సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్… ఆ తర్వాత నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత రెండు సినిమాలు రాగ.. అవి రెండు ప్లాప్ అయ్యాయి అనే చెప్పాలి. అయిన కూడా ప్రభాస్ డిమాండ్ అనేది కొంచెం కూడా తగ్గలేదు. ఇక అతని రెమ్యునరేషన్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పడు ప్రభాస్ ఒక్కే సినిమాకు వంద కోట్లకుపైగానే తీసుకుంటున్నాడు.

Advertisement

అయితే ప్రభాస్ ఎంత పెద్ద సినిమాలు తీసిన కూడా… సమయం అనేది కొంచెం దొరికితే తన పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోతాడు. అంటే ఎవరిని కలవకుండా తన ఇంట్లోనో.. లేక ఫామ్ హౌస్ లోనే ఉండిపోతాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ప్రభాస్ ఫామ్ హౌస్ ల విలువ అనేది తెగ వైరల్ గా మారుతుంది. అయితే రెబల్ స్టార్ కు ఒక్కటి కాదు.. రెండు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అందులో ఒక్కటి అందరూ హీరోల మాదిరిగానే మన హైదరాబాద్ శివార్లలో ఉంది. అయితే దీని విలువ అనేది ఇప్పుడు 60 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఓ బంగ్లాతో పాటుగా.. మొత్తం తోటలు అలాగే ప్రభాస్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక అదే విధంగా ప్రభాస్ కు మరో ఫామ్ హౌస్ అనేది తన సొంత గ్రామం అయిన భీమవరంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫామ్ హౌస్ ఊరిలో ఉండటం వల్ల అంత ధర అనేది ఉండకపోవచ్చు. కానీ ఈ ఫామ్ హౌస్ అనేది మొత్తం 83 ఎకరాలలో ఉండటం అనేది విశేషం. ఇక ఇందులో మొత్తం అన్ని రకాలైన తోటలు, కూరగాయల చెట్లు అనేవి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ 5 సినిమాలు అనౌన్స్ చేసాడు. అందులో ఇప్పుడు సాలార్ అలాగే ఆదిపురుష్ అనేవి సెట్స్ పైన ఉన్నాయి. మరి ఈ సినిమాలు అయిన విడుదల అయ్యి విజయం సాధిస్తాయా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

ఉమ్రాన్ కెరియర్ నాశనం చేస్తున్న బీసీసీఐ..!

Visitors Are Also Reading