Home » వివి.నాయక్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి కొడాలి నాని ఎందుకు అడ్డుపడ్డారు…. ఇంట్రెస్టింగ్ స్టోరీ….!

వివి.నాయక్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి కొడాలి నాని ఎందుకు అడ్డుపడ్డారు…. ఇంట్రెస్టింగ్ స్టోరీ….!

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో వివి. వినాయక్ ఒకరు. కొన్నేళ్ళుగా వివి వినాయక్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం వివి. వినాయక్ తో సినిమా చేయాలని క్యూ కట్టేవారు. అంతేకాకుండా బడా నిర్మాతలు సైతం వివి వినాయక్ తో సినిమాలు చేసేందుకు భారీ రెమ్యూనరేషన్ లను ఆఫర్ చేసేవారు. ఇదిలా ఉంటే చిన్ననాటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో దర్శకుడి గా ఎదిగేందుకు ఎంతో కష్టపడినట్టు వివి వినాయక్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement

తమకు సొంతంగా థియేటర్ ఉండేదని ఆ థియేటర్ కి లాస్ రావడంతో అప్పులు అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత తను చెన్నై వచ్చి సినిమాల్లో ప్రయత్నించానని చెప్పారు. పదేళ్లపాటు సినిమాలో ఛాన్స్ ల కోసం ప్రయత్నం చేసి ఆ తర్వాత సక్సెస్ అవ్వలేకపోతే వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తాను ఒక సంవత్సరం పాటు ఒక ప్రేమ కథను రాసుకున్నానని దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని చెప్పారు.

Advertisement

అంతేకాకుండా తనకు ఒక వ్యక్తి ద్వారా ఫారెన్ లో ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పుడే ఎన్టీఆర్ కు ఒక స్టోరీ చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని కథ చెప్పేందుకు వెళ్లానని అన్నారు. తనకు ఎన్టీఆర్ 20 నిమిషాలు సమయం ఇచ్చారని తెలిపారు. దాంతో తాను ఐదు నిమిషాల్లో కథ చెబుతారని… నచ్చితే కంటిన్యూ అవుదామని అన్నారు. ఐదు నిమిషాల తర్వాత ఎన్టిఆర్ కు నచ్చడంతో రెండు గంటల పాటు తన కథను పూర్తిగా విన్నారని తెలిపారు.

ఎన్టీఆర్ కు కథ చాలా నచ్చిందని… అయితే ఎన్టీఆర్ స్నేహితుడు నిర్మాత కొడాలి నాని ఎన్టీఆర్ కు ప్రేమకథలు చేయవద్దని చెప్పాడని దాంతో ఎన్టీఆర్ ఆ సినిమాను క్యాన్సిల్ చేశారని అన్నారు. ఆ తర్వాత తను మరో కథ చెప్తా అని వినాలని కోరినట్టు తెలిపాడు. ఆ తర్వాతే ఆది కథను చెప్పానని అన్నారు. ఆ కథ ఎన్టీఆర్ తో పాటు కొడాలి నానికి కూడా బాగా నచ్చిందని చెప్పారు. అలా ఆది సినిమా పట్టాలెక్కిందని సూపర్ హిట్ గా నిలిచిందని పేర్కొన్నారు.

Also read :రోజా ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…! ఖరీదైన కార్లతో పాటూ ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే…?

Visitors Are Also Reading