Home » ఇలియానాకు బిగ్ షాక్…అలాంటి ప‌ని చేయ‌డంతో బ్యాన్ చేసిన ఇండ‌స్ట్రీ..?

ఇలియానాకు బిగ్ షాక్…అలాంటి ప‌ని చేయ‌డంతో బ్యాన్ చేసిన ఇండ‌స్ట్రీ..?

by AJAY
Ad

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ లలో ఇలియానా కూడా ఒక‌రు. గోవా నుండి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ హీరోగా న‌టించిన దేవ‌దాస్ సినిమాతోనే ఇలియానా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అందం మ‌రియు న‌ట‌న‌తో ఆద‌ర‌గొట్టి ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది.

ALSO READ :గోపిచంద్ తన జీవితంలో అంత పెద్ద తప్పు చేశాడా ? వారే కారణమా..? 

Advertisement

పోకిరి సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీ క‌ట్ట‌గా ఈ సినిమాలో ఇలియానా ఫిగ‌ర్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ త‌ర‌వాత స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ భారీ రెమ్యున‌రేష‌న్ ను సైతం అందుకుంది. ఇక ఆ త‌ర‌వాత బాలీవుడ్ లో కూడా ఇలియానా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

Advertisement

కానీ బాలీవుడ్ లో స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. ఆ త‌ర‌వాత ప్రేమాయణం వ‌ల్ల సినిమాల‌కు కాస్త దూరం అయ్యింది. దాంతో మెల్లిమెల్లిగా ఆఫ‌ర్ లు కూడా త‌గ్గిపోయాయి. ఇలాంటి స‌మ‌యంలో అమ్మ‌డికి మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇలియానా ను త‌మిళ చిత్ర బ్యాన్ చేసిందంటూ వార్త‌లు గుప్పుమంటున్నాయి.

దాని వెన‌క పెద్ద కార‌ణం ఉంద‌ని టాక్. ఇలియానా ఓ త‌మిళ చిత్రానికి సైన్ చేసింద‌ట‌. అంతే కాకుండా నిర్మాత వ‌ద్ద అడ్వాన్స్ కూడా తీసుకుంట‌ద‌ట‌. కానీ ఆ త‌ర‌వాత మాత్రం సినిమాలో న‌టించ‌లేదట‌. దాంతో ఇలియానా కాంట్రాక్ట్ ను బ్రేక్ చేసింద‌ని నిర్మాత ఫిర్యాదు చేయ‌డంతో అక్క‌డ బ్యూటీని బ్యాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ALSO READ :‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Visitors Are Also Reading