Home » ‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

by Bunty
Ad

 

విక్టరీ వెంకటేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్ అంటే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఫ్యామిలీ మ్యాన్. ఆయనకున్న అభిమానుల్లో ఇంచుమించుగా 80 శాతం ఫ్యామిలీ ఆడియన్సే. కుటుంబం అంతా కూర్చొని హాయిగా చూసే సినిమాలను ఇప్పటివరకు వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ఈ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రానా నాయుడు వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని రానా దగ్గుబాటి ఇప్పటికే హెచ్చరించారు.

read also : “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

Advertisement

హైదరాబాదులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్పష్టంగా వెల్లడించారు. ఇంట్లో ఏ ఇద్దరు కలిసి రానా నాయుడు చూడొద్దని, ఒంటరిగానే చూడాలని సలహా ఇచ్చారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ పై ఫ్యాన్సులో ఓ చర్చ నడుస్తోంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్ దాదాపు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కరణ్ అన్షుమాన్, సూపర్న్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ నాగానాయుడు (తండ్రి), రానా, రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌

Visitors Are Also Reading