Home » నాగిని ఫేమ్ మౌని రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నాగిని ఫేమ్ మౌని రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

మౌని రాయ్ పరిచయం అవసరం లేని పేరు హిందీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో నాగిని సీరియల్స్ ద్వారా  మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మౌని రాయ్ ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే.. మరోవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే మౌని రాయ్ ఆస్తుల గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది.


2006లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ సిరీస్ తో సినీరంగ ప్రవేశం చేసినటువంటి ఈమె అనంతరం నాగిని సీరియల్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినిమాలపరంగా కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి మౌని రాయ్ నికర విలువ, ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నివేదిక ప్రకారం మౌని రాయ్ నికర విలువ దాదాపు రూ.41 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈమె సినిమాలలో నటిస్తూనే మరోవైపు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ విధంగా సినిమాలలో, సీరియల్స్ లో కొనసాగుతూనే భారీగా ఆస్తులు కూడపెట్టారని తెలుస్తోంది. ఇక ఈమె ఒక మ్యూజిక్ ఈవెంట్ లో కనుక సందడి చేస్తే సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట. అలాగే కళ్యాణ్ జువెలర్స్, లాక్మే, ఫెయిర్ల వ్లీతో సహా పలు ప్రముఖ బ్రాండ్ లకు మౌని రాయ్ ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్. ప్రతి ఎండార్స్ మెంట్ డీల్ కు ఆమె దాదాపు 10 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికదా కూడా భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తన మొదటి భార్యకు అక్కినేని నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడు ?

‘సలార్’ డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి కారణం అదేనా..?

Visitors Are Also Reading