Home » నల్లవెల్లుల్లి చేసే మేలు గురించి మీకు తెలుస్తే మీరు దానిని వ‌ద‌ల‌రు..!

నల్లవెల్లుల్లి చేసే మేలు గురించి మీకు తెలుస్తే మీరు దానిని వ‌ద‌ల‌రు..!

by Anji
Ad

చాలామందికి నల్ల వెల్లుల్లి గురించి చాలా తక్కువనే తెలుసు. రక్తపోటును తగ్గించడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. పురాతన కాలంలో ఈజిప్టులో ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారికి నల్ల వెల్లుల్లిని ఇచ్చేవారట. అంతే కాదు తొలి ఒలింపిక్ క్రీడలలో అథ్లెట్ల కు నల్లవెల్లుల్లి ఇచ్చేవారు . దీని ఫలితంగా వారి శారీరక సామర్థ్యం పెరిగడంతో చక్కని ప్రదర్శన చేసేవారు. భారతదేశంలోనే కాకుండా చైనా ఔషధ విధానంలో కూడా నల్లవెల్లుల్లి ముఖ్యమైందిగా పరిగణించారు.అసలు ఈ నల్ల వెల్లుల్లి ఎక్కడి నుంచి వచ్చింది. దాని ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నల్లవెల్లి అంటే మరేదో కాదు అండి.. తెల్ల వెల్లుల్లిలో ఒక భాగమే. ఇది కిన్వ ప్రక్రియ ద్వారా రూపొందుతుంది. దీనిని ఓ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు. చాలా వారాల పాటు తేమ లో ఉంచిన తర్వాత ఇది వాడకానికి సిద్ధమవుతోంది. ప్రక్రియ తర్వాత మరిన్ని పోషకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇది మెరుగైన ప్రభావాన్ని చూపుతుంది. దీనిని అతిసారం ఉన్న రోగులకు ఇస్తారు. నల్ల వెల్లుల్లిని జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. కిణ్వ‌ ప్రక్రియ తర్వాత చల్ల వెల్లుల్లి తో పోల్చితే నల్ల వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయ‌ప‌డుతుంది. దీని ఫలితంగా డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

2019 లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. కొలెస్ట్రాల్ పాటు పెరుగుతున్న రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. తద్వారా గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నల్లవెల్లుల్లి పై చేసిన పరిశోధనలో ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని వెల్లడయింది. కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించి అంశాలు బిల్లులో ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపు చేస్తుంది. దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

Also Read : 

చనిపోయే ముందు ఆ ముగ్గురు దర్శకులతో మాట్లాడిన ఉదయ్ కిరణ్…వారికి ఏం చెప్పాడంటే..!

మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?

Visitors Are Also Reading