చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ ను అందుకున్నారు. ఉదయ్ కిరణ్ నటనకు ఎంతోమంది ఫిదా అయ్యారు. సొట్ట బుగ్గల అందంతో ఉదయ్ కిరణ్ అమ్మాయిలను తన వైపు తిప్పుకున్నారు. అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు.
udaykiran
ఈ క్రమంలో చిరంజీవి పెద్ద కూతురు తో ఉదయ్ కిరణ్ కు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే అనుకోని కారణాలవల్ల ఈ పెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది. పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో పాటు ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో అనుకోని సమస్యలు కూడా వచ్చాయి. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం మొదలయ్యాయి. దాంతో ఉదయ్ కిరణ్ కు ఇచ్చిన అడ్వాన్స్ లను సైతం నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు.
udaykiran
అప్పటి వరకు స్టార్ గా ఉన్న ఉదయ్ కిరణ్ వద్దకు ఒక్క దర్శకుడు, నిర్మాత రాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చాలా కాలం పాటు డిప్రెషన్ లో ఉన్న ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన దర్శకుడు విఎన్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు రాత్రి తనకు ఫోన్ చేశారని చెప్పారు.
తన భార్యతో కలిసి పబ్ కు వచ్చా అని త్వరలోనే మనం కలిసి మళ్లీ సినిమా చేద్దాం అని చెప్పాడని అన్నారు. తాను డిప్రెషన్ లో ఉంటే ఉదయ్ కిరణ్ దైర్యం చెప్పాడని అన్నారు. ఆ రోజు తనతో దాదాపు మూడు గంటల పాటు ఉదయ్ కిరణ్ మాట్లాడాడని తెలిపారు. కానీ ఆ మరుసటి రోజు ఉదయ్ కిరణ్ మరణ వార్త విని షాకయ్యాను అని చెప్పాడు. తనకు ధైర్యం చెప్పి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుంటాడు అని అనుకోలేదన్నారు. అంతేకాకుండా తనతో పాటు దర్శకుడు తేజ, పూరి జగన్నాథ్ లతో కూడా ఉదయ్ కిరణ్ ఫోన్ లో మాట్లాడేవాడు అని చెప్పాడు.
Also read :
మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?
బాలయ్య చిరుల కాంబోలో రావాల్సిన ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…!