Home » భార్య భర్తను పేరు పెట్టి పిలిస్తే.. ఇంత ప్రమాదమా…?

భార్య భర్తను పేరు పెట్టి పిలిస్తే.. ఇంత ప్రమాదమా…?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

సాధారణంగా మన భారతదేశ సంప్రదాయం ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి పుట్టుక చావు మధ్యలో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది వివాహం మాత్రమే. అలాంటి వివాహాన్ని చాలామంది అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటారు.

Advertisement

వారు అనుకున్న విధంగానే వివాహాలు కూడా చేసుకుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహంలో అనేక ఘట్టాలు ఉంటాయి. వివాహం తర్వాత భార్య భర్తను భర్త భార్యను గౌరవించుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భార్య అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని కట్టుబాట్లు ఉంటాయి..

also read:Kaikala sathyanarayana: పాపం కైకాల ఆ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారా..?

Advertisement

అందులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వివాహం తర్వాత భార్య భర్తను పేరు పెట్టి పిలువకూడదు అని మన పెద్దలు అంటుంటారు. అలా ఎందుకు పిలవకూడదో చాలామంది ఇప్పటికే ఆలోచించి ఉంటారు. అయితే భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు అనే దాని వెనుక పెద్ద కథే ఉందని పెద్దలు అంటున్నారు. మరి ఆ కథ ఏంటో చూద్దాం. మన హిందూ సంప్రదాయంలో వివాహం తర్వాత ప్రతి భార్య తన భర్తను పేరు పెట్టి అస్సలు పిలవద్దు. అలా పిలవడం పాపంగా భావిస్తూ ఉంటారు.

అలా పేరు పెట్టి పిలవలేక పోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందంటున్నారు పండితులు. భర్తను భార్య పేరు పెట్టి పిలవడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే భర్తను పేరు పెట్టి పిలవరు. అంతేకాకుండా భర్త భార్య కంటే ఎప్పుడు పెద్దవాడై ఉంటాడు, హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దవారిని చిన్నవారు పేరు పెట్టి పిలిస్తే వారికి ఆయుష్షు తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా పెద్దల్ని గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి భర్త కంటే భార్య వయసులో చిన్నది కాబట్టి పేరు పెట్టి పిలవకూడదట.

also read:

Visitors Are Also Reading