Home » Kaikala sathyanarayana: పాపం కైకాల ఆ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారా..?

Kaikala sathyanarayana: పాపం కైకాల ఆ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ అంటే తెలియని వారు ఉండరు. ఆయన హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా.. కమెడియన్ గా.. ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ. ఈ విధంగా తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 777 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ నటన అద్భుతం అని చెప్పవచ్చు. అలాంటి కైకాల సత్యనారాయణ ఇండస్ట్రీకి దూరమయ్యాడని చెప్పడం చాలా బాధాకరం..

Advertisement

also read:Dhamaka Movie review : “ధమాక” సినిమా రివ్యూ…మాస్ మహరాజ్ హిట్ కొట్టాడా…?

ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటి తనకు నచ్చిన ప్రతి పాత్రను చేశారు. అలాంటి ఆయనకు తన జీవితంలో తీరని కోరిక ఒకటి ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేంటయ్యా అంటే..కైకాల సత్యనారాయణకు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాలని అనుకునే వారట. ఆ కాలంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో కైకాల సత్యనారాయణ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయమందుకుంది.

Advertisement

ఆ తర్వాత జనరేషన్ అయిన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ తో కైకాల సత్యనారాయణ కలిసి ఏదైనా సినిమాలో నటించాలని ఆయన కు బలమైన కోరిక ఉండేదట. కానీ ఆ కోరిక ఇప్పటివరకు తీరలేదు. ఇటీవల రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసిన కైకాల సత్యనారాయణ చాలా ఆనందపడ్డారట. ఇలాంటి కాంబినేషన్లో చిరంజీవి బాలకృష్ణతో కలిసి నేను నటిస్తే బాగుండు అని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఆయన కోరిక తీరకుండానే మరణించడం బాధాకరం.

also read:Kaikala Satyanarayana : కైకల యుముడిగా చేసిన సినిమాలు ఇవే

Visitors Are Also Reading