Home » చిరంజీవి సినిమాలో నటించమని అడిగితే శ్రియ ఏమందో తెలుసా ?

చిరంజీవి సినిమాలో నటించమని అడిగితే శ్రియ ఏమందో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరస సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ముందువరుసలో ఉన్నారు. పాండమిక్ తరువాత చాలామంది సినిమాలు చేసే విషయంలో చాలా స్లో అయిపోయారు. కానీ చిరంజీవి, రవితేజ మాత్రం  అందరికీ భిన్నంగా వేగవంతంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలను చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే.. భారీ క్రేజ్ ఉండేది. కానీ రాజకీయాల్లోకి వెళ్లడం..  అక్కడ బోల్తా పడటం.. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడంతో కొద్దిగా క్రేజ్ తగ్గినట్టయింది.  ఇక ఈ లోపు మధ్యలో ప్రభాస్,  మహేష్ మరి కొంతమంది హీరోల రేంజ్ పెరిగింది.  

Also Read :  దిల్ రాజ్ యమ స్పీడుగా ఉన్నాడే.. ఏకంగా ముగ్గురితో జాక్పాట్ కొడతాడా..?

Advertisement

అదేవిధంగా ఇండస్ట్రీలో లెక్కలు కూడా మారాయి.ఇక  చిరంజీవి వయసు కూడా మీద పడడంతో ఒకప్పుడు ఆయన పక్కన నటించడానికి పోటీపడ్డ హీరోలు ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా..  ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళం లో అజిత్ హీరోగా నటించిన “వేదాళం” నీ తెలుగులో “భోళా శంకర్” గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.  అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ శ్రియనీ తీసుకోవడానికి మేకర్స్ సంప్రదించగా.. ఊహించని షాక్ ఇచ్చిందట.  

Advertisement

Also Read :  మేనల్లుడిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..!

Manam News

అసలు విషయంలోకి వెళ్తే.. ఏకంగా రూ.కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. కేవలం ఒక్క సాంగ్ కోసం అంత అడగటంతో మేకర్స్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా వెనక్కి వచ్చేశారు. 40 ఏళ్ల వయసు కలిగిన శ్రీయ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లయినా కానీ భారీ ఎత్తున ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని చిరంజీవి పక్కన స్టెప్పులేయాలని శ్రియని సంప్రదిస్తే.. కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో నిర్మాతలకు చుక్కలు కనబడి సైలెంట్ అయిపోయారట.  ఇక మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో శ్రీయనే స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.  

Also Read :  ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల… నరేష్ ఉగ్రరూపం

Visitors Are Also Reading