Home » మేనల్లుడిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..!

మేనల్లుడిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలో సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ ముందుంటారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా సినిమా బాగుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తుంటాడు. అలాంటిది తన తోబుట్టువు కుమారుడు హిట్ కొడితే ప్రశంసించకుండా ఉంటాడా..? మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తేజ్ తో పాటు చిత్ర బృందాన్ని పొగిడాడు మెగాస్టార్ చిరంజీవి. 

Also Read :   చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

Advertisement

 

విరూపాక్ష చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే రోజు సాయిధరమ్ తేజ్ కెరీర్ లో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగిన తరువాత నటించిన ఫస్ట్ సినిమా కావడంతో అభిమానులు సినిమా ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డారు.

కానీ అంచనాలకు మించి సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పుల్ సంతోషంగా ఉన్నారు. ఈ పరిణామంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ ని అభినందించారు.ముఖ్యంగా విరూపాక్ష అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. తేజ్ కమ్ బ్యాక్ ఇవ్వడంపై తాను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు సంతోషంగా ఉంది.  చిత్ర యూనిట్ కి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. దీనిపై తేజ్ స్పందిస్తూ.. “థాంక్స్ మామ, అత్త… లవ్ యు బోత్” అని కామెంట్ చేశారు. 

Also Read :  Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Visitors Are Also Reading