Home » డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయడం ఎలా ? ఇవి నకిలీ, అసలు గుర్తించడం ఎలా ?

డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయడం ఎలా ? ఇవి నకిలీ, అసలు గుర్తించడం ఎలా ?

by Anji
Ad

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో  ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు  ఈ డీప్ ఫేక్ వీడియో అంటే ఏమిటి.? దీనిని ఎలా గుర్తించవచ్చు.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.


రియల్ వీడియోలో వేరొకరి ముఖాన్ని అమర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డీప్ లెర్నింగ్ అనేక స్పెషల్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించడాన్నే డీప్ ఫేక్ అంటారు. ఈ పద్ధతి ఉపయోగించడం వల్ల వీడియో, ఫోటో, ఆడియోలో సులభంగా మార్పులు చేసుకోవచ్చు. ఈ సాధనాన్ని ఉపయోగించడం వల్ల ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా వివరిస్తున్న కొద్ది అది చూపించే ప్రభావం పెరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో సోషల్ మీడియాకీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియో భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవీ ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోదు.

Advertisement

Advertisement

వాస్తవానికి డీప్ ఫేక్ కంటెంట్ ను మొదటిసారిగా 2014లో సింథటిక్ మీడియా అని పిలుస్తుండేవారు. తర్వాత దానికి జనాదరణ పెరగడంతో 2017లో రెడ్డిట్ నిర్వాహకులు జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్ వర్క్స్ టెక్నిక్ ను ఉపయోగించి మొదటిసారి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఆశ్లీల వీడియోలకు సెలబ్రిటీల ముఖాలు పెట్టడంతో దానికి మంచి ఆదరణ లభించింది. 2018 నాటికి ఈ సాంకేతికను మరింత డెవలప్ చేశారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడవడంతో మరింత పవర్ ఫుల్ గా మారింది. ఫేక్ వీడియోలను ఎన్. కోడర్, డీకోడర్ నెట్ వర్క్ ల కలయికను ఉపయోగించి క్రియేట్ చేస్తారు. ఫేక్ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ కూడా ఒరిజినల్ వీడియో ఉండేలా ఎన్ కోడర్, డీకోడర్ నెట్ వర్క్స్ ఫీల్డర్ చేస్తాయి. అందుకే డీప్ ఫేక్ వీడియోలు అంత క్లియర్ గా ఒరిజినల్ వీడియో మాదిరిగానే కనిపిస్తుంది.

 డీప్ ఫేర్ వీడియోలను నిశితంగా పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చని ఏఐ ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు.  టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను క్రియేట్ చేయడం చాలా సులభమైన పని. కానీ ముఖ కదలికలు, చర్మం రంగు, లైటింగ్ ను ఒరిజినల్ వీడియోలో ఉన్నట్లు డిఫ్ మేకర్స్ మాత్రం చేయలేరు. కంటిరెప్పల కదలికల ద్వారా డీప్ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. డీప్ ఫేక్ వీడియోలను ఏఐ సాయంతో క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో ఏఐ ద్వారా చేసిన వీడియోల్లో లిప్ సింకింగ్ ఎర్రర్స్ క్లియర్ గా కనిపిస్తాయి. వీడియోను ఎవరు షేర్ చేస్తున్నారు? సెలబ్రెటీ చేస్తున్నారా? లేక గుర్తుతెలియని అకౌంట్ నుంచి షేర్ చేశారా? అనే విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading