తన కోపమే తన శత్రువు అంటారు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. మనం వివిధ కారణాలతో కోపానికి గురైనప్పుడు అడ్రీనలిన్, కార్టీసాల్ అనే హార్మోన్ విడుదలవుతాయి. కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఇవి పాటించండి.
* కోపం వచ్చే సూచనలు ఉంటే ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఇది కోపం వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది.
Advertisement
READ ALSO : Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…
* కోపంగా ఉన్న పరిస్థితి నుంచి మీ దృష్టి మళ్లించడానికి లాంగ్ బ్రీత్ తీసుకొని మనసులో ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టండి.
* కోపానికి కారణమయ్యే సందర్భాలు ఉంటే మిమ్మల్ని మీరే డైవర్ట్ చేసుకోవడానికి ఏవైనా గేమ్స్, వంట, డ్యాన్స్, పాట పాడటం లాంటి మీకు ఇష్టమైన పనిచేస్తూ కోపాన్ని నియంత్రించుకోండి.
Advertisement
READ ALSO : Adipurush: ‘ఆదిపురుష్’ న్యూ అప్డేట్.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు
* తరచూ ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తే మీ మైండ్ సెన్సిటివ్ గా ఉన్నట్లు. ఇలాంటి వాళ్లకు కోపం తొందరగా వస్తుంది. పరిస్థితి ఏదైనా గతం గతహ అంటూ ముందుకు సాగిపోండి.
* మీరు తరచూ చిన్న విషయాలకు కోపానికి గురవుతుంటే ధ్యానం చేయండి.
* ఇరిటేట్ చేసే అంశాలకు, మూర్ఖంగా వాదించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
READ ALSO : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?