Home » Adipurush: ‘ఆదిపురుష్‌’ న్యూ అప్‌డేట్‌.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు

Adipurush: ‘ఆదిపురుష్‌’ న్యూ అప్‌డేట్‌.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు

by Bunty
Ad

ప్రభాస్ గురించి తెలియని వారుండరు. ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO : Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…

Advertisement

అయితే ఈ ఇతిహాస చిత్రం ఆది పురుష్ కు అరుదైన గౌరవం దక్కించుకుంది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. కాగా, రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఆది పురుష్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఆది పురుష్ నుంచి సీతకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఆది పురుష్ లో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి హీరోయిన్గా నటిస్తోంది.

READ ALSO : ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

On Sita Navami, Kriti Sanon's motion poster as Janaki from Prabhas starrer Adipurush out | Celebrities News – India TV

గతంలో సీత పాత్ర విషయంలో కూడా వివాదం రేగిన విషయం తెలిసిందే. మొన్నమధ్య విడుదల చేసిన పోస్టర్స్ లో సీత పాత్రకు బొట్టు, చేతికి గాజులు లేకపోవడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, ఈసారి విడుదల చేసిన సీత టీజర్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీత పాత్రను నిండుగా చూపించారు. కృతి సనన్ కూడా సీతగా అద్భుతంగా కనిపిస్తోంది. ఆది పురుష్ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర బృందం.

READ ALSO : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Visitors Are Also Reading