Home » లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేముందు ఈ సంకేతాలు కనిపించడం పక్కా..!

లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేముందు ఈ సంకేతాలు కనిపించడం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రతీ మనిషికి కావాల్సిందే డబ్బు మాత్రమే కాదు. ప్రస్తుతం డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ముఖ్యంగా ఈరోజుల్లో ఏది నిలబడాలన్న డబ్బు ఉండాలి. మనుషుల మధ్య ప్రేమ, బంధాలతో పాటు అవి నిలబడేందుకు ఖచ్చితంగా డబ్బు కావాలి. చాలా మంది దేనికైనా అదృష్టం ఉండాలని అంటుంటారు. మరి ఆ అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుంది. మన జీవితం సుడి తిరుగుతుందని ఎప్పుడూ అనిపిస్తుంది. ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా..?  అలాంటి విషచాలే తెలుసుకుందాం. 

Advertisement

హిందువులు లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. మిగతా రోజుల్లో కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు. ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబై.. వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెబుతారు. ఇంటిని ఇలా శుభ్రపరిచి వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్ళకి లక్ష్మీదేవి వస్తుందని పెద్దలు చెబుతారు. పల్లెటూర్లలో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపించే విధంగా పెట్టుకుంటారు. ఇలా ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట.అంతేకాదు కుటుంబంలో అందరూ ఆనందంగా, ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటే అక్కడ ఆ చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అంటారు. 

స్త్రీలు అందుకోసమే ఉదయాన్నే లేచి ఇల్లు, గుమ్మాలు ఊడ్చి, తల స్నానం చేసి లక్ష్మీదేవిలా తయారవుతారు. వారిని అలా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. శుభ్రంగా లేకపోతే ఇంటికి వచ్చి లక్ష్మీదేవి అటు నుంచి అటే వెళ్ళిపోతుందని అంటారు. లక్ష్మీదేవిని సంపద లక్ష్మీగా, డబ్బుగా కొలుస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సిరి, సంపదలు సిద్ధిస్తాయని నమ్ముతారు. డబ్బు కోసం ధనవంతులు సైతం నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు. పెద్ద పెద్ద ధనవంతులు , వ్యాపారవేత్తలు కూడా దైవ భక్తి కలిగి ఉంటారు. ఒకప్పుడు వాళ్లు కూడా కింద స్థాయి నుంచి ఎదిగిన వారే. ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు. అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు.

Also Read :  మీ ప్రియమైన వ్యక్తి మీ గురించే ఎప్పుడు ఆలోచించాలంటే.. ఈ 3 పనులు చేయండి..?

కోకిల కూత :

Kokila Manam News

కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది. కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం , అశుభంలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు. మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతారు. ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని, మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.

Advertisement

చీమలు తిరిగితే :

 

 ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాం. ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది. నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు. అక్షింతలు అనేవి శుభ్రం కలగజేసేవి. కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట.  అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు.

బల్లి పడితే : 

Balli :

బల్లి పడితే చిరాకు పడతాం. అశుభంగా భావిస్తారు. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శాస్త్రం ప్రకారం.. కుడి చేతి పై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే.. త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు.

రెండు తలల పాము కనిపిస్తే : 

పాము అంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచికమని కొంతమంది నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనబడితే మంచిది. చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తారు. 

Also Read :  పెళ్లికి వధూవరుల జాతకాలు కలిసాయని ఎలా చెబుతారో తెలుసా..?

కుటుంబంలో మార్పులు :

లక్ష్మీదేవి వచ్చేముందు మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష, అసూయ, కోపం వంటివి తగ్గుతాయి. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. భార్య భర్తల మధ్య కలహాలకి స్పేస్ ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి సంతోషంగా ఉన్నారంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు భావిస్తారు.

సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు సజావుగా సాగుతాయి. పనులు సజావుగా అయితే ప్రతిఫలం ఉంటుంది. ఆనమ్మకంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. శాస్త్రాలను, పూర్వీకుల మాటలను నమ్మడం వల్ల మోసాపోవడం అయితే జరగదుగా. కుదిరితే భగవంతున్ని నాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కారు, బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సంపాదించుకునే శక్తిని ఇవ్వు అని కోరుకుంటే తప్పకుండా ఇస్తాడనే నమ్మకం అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి. 

Also Read :  అతిగా వ్యాయామం చేస్తే ఇంత నష్టం వాటిల్లుతుందా ? సరికొత్త రిపోర్ట్..!

Visitors Are Also Reading