Home » Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

by Anji
Ad

Balli Sastram in Telugu: సాధారణంగా భారతదేశ సంప్రదాయం ప్రకారం.. పురాతనం నుంచే పలు శాస్త్రాలు, పురాణాలను నమ్ముతుంటారు. అందులో ముఖ్యంగా ఎక్కువగా మూఢనమ్మకాలు, శకునాలు వంటివాటిని కూడా ఆచరిస్తుంటారు. అలాంటి వాటిలో బల్లి శాస్త్రం కూడా ఒకటి. మన శరీరంపై బల్లి ఏ భాగంపై పడితే ఏమవుతుందనే అపోహలు ఉంటాయి.

బల్లి శాస్త్రం తెలుగులో

బల్లి శాస్త్రంలో శకునాల ప్రభావం గురించి ప్రస్తావించారు. కొన్ని శరీర భాగాలపై బల్లి పడితే శుభ శకనంగా, మరికొన్ని భాగాలపై పడితే అపశకునంగా నమ్ముతుంటారు.  

Advertisement

Balli Sastram in Telugu : మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

ఇందులో పురుషులకు, స్త్రీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా పురుషుని శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే వారికి శుభాలు కలుగుతాయి. పురుషుడి ఎడమ భాగంపై, స్త్రీ కుడి భాగంపై బల్లి పడినట్టయితే అశుభాలు కలుగుతాయని శకునంగా పరిగణిస్తారు. ఇక రాత్రి వేళలో బల్లి పడినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. పిల్లలు లేదా పెళ్లి కాని వారి మీద బల్లి పడినట్టయితే ఆ ఫలితం వారి తల్లిదండ్రులకు కూడా ఉంటుందట. పురుషుల్లో బల్లి తలపై పడినట్టయితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సంకేతం. తలపై భాగాన పడినట్టయితే రుణ భయం, ముఖం మీద పడితే ఊహించని సంపద వస్తుందని, ఎడమ కంటిపై పడితే శుభవార్త వినే అవకాశముందని సూచిస్తుంది. అయితే కుడి కంటిపై పడితే మాత్రం అనుకున్న ఫలితం దక్కదు. నుదటిపై పడితే ప్రేమికుల నుంచి ఎడబాటు, పై పెదవిపై పడితే గొడవలు, కింది పెదవి పై పడితే ఆరోగ్య లాభం, రెండు పెదవులపై పడితే మరణ వార్త వినే అవకాశముందని సంకేతమని బల్లి శాస్త్రం ప్రకారం.. నమ్ముతుంటారు. 

Balli Sastram in Telugu For Female and Male

Also Read :  భార్య భర్తను పేరు పెట్టి పిలిస్తే.. ఇంత ప్రమాదమా…?

Vastu Shastra: Lizard Falling on body and Seeing lizard in dream, Know the meaning | Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? ఆధ్యాత్మికం News in Telugu

Advertisement

ఇక బల్లి నోటిపై పడితే ఆరోగ్యం నశిస్తుందని.. వీపు వెనుక భాగంలో పడితే విజయం వరించే అవకాశముందని తెలుస్తుంది. కలలో బల్లి కనిపించినట్టయితే ప్రభుత్వానికి సంబంధించి భయం పట్టుకుంటుందని నమ్ముతుంటారు. ఇక మణికట్టుపై బల్లి పడినట్టయితే ఇంటి మరమ్మత్తు లేదా ప్రాజెక్ట్ విభజన జరుగుతుంది.

బల్లి పంచాంగం తెలుగులో

పురుషుడి చేతిపై బల్లి పడితే ఆర్థికంగా నష్టం కలిగే అవకాశముంది. వేళ్ల మీద పడితే పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. కుడి చేతిపై పడితే కష్టాలు వస్తాయని సంకేతం. ఎడమ చేతిపై బల్లి పడినట్టయితే అవమానం కలుగుతుంది. తొడలపై పడితే వస్త్ర నష్టం, మీసాలపై పడితే సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటారని బల్లి శాస్త్రం చెబుతుంది.  

Also Read :  Christmas wishes, quotes, images in Telugu 2022 : క్రిస్మస్ పండుగ ప్రత్యేకత.. 2022 క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు మీ కోసం

బల్లి శాస్త్రం తెలుగులో

బల్లి శాస్త్రం తెలుగులో

స్త్రీలలో పక్కటెముకలపై, నడుము కుడి భాగంపై బల్లి పడినట్టయితే సోదర సోరదీమణులకు హాని కలుగుతుందట. నడుము ఎడమ వైపు భాగంలో బల్లి పడినట్టయితే తల్లిదండ్రులకు పీడ కలుగుతుంది. అదేవిధంగా ఎడమ అరచేతిలో కూడా బల్లి పడినట్టయితే కష్టాలు వచ్చే అవకాశముంది. వేళ్ల మీద ఆపడితే ఆపదలు సంభవిస్తాయి. కుడి వేళ్ల మధ్యలో, ఎడమ చేతి గోళ్ల మీద బల్లి పడితే చిక్కులు మొదలవుతాయి. కుడి మోచేయి పై భాగంలో పడినట్టయితే శత్రువులు నాశనమవుతారు. కుడి అరచేతిలో బల్లి పడినట్టయితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.ముఖ్యంగా మణిపూస మీద బల్లి పడితే ధనవంతులు అవుతారట. పొట్ట మడతలపై పడితే సోదరీమణులకు కీడు కలుగుతుంది. స్త్రీలలో ఎడమ చేతిపై బల్లి  పడినట్టయితే స్త్రీకి సుఖం లభిస్తుంది. ఆడ వారి జడ మీద బల్లి పడినట్టయితే భర్తకు హాని కలుగుతుంది. తలమీద బల్లి పడినట్టయితే మేనమామకు కీడు జరుగుతుందట. ముఖ్యంగా బల్లి శాస్త్రం ప్రకారం.. శరీరంపై ఎక్కడ బల్లి పడినా వెంటనే తలస్నానం చేయాలట. కానీ కొన్నిసందర్భాల్లో బయట ఉన్నప్పుడు వీలు లేనప్పుడు తలపై నీళ్లు అయినా చల్లుకోవాలంటున్నారు పండితులు. 

Also Read :  మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలతో సులభంగా తగ్గించుకోండి..!

Visitors Are Also Reading