Home » సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

by Bunty
Ad

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ అంటే ఎంతటి సినీ బ్యాగ్రౌండ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామానాయుడు నుంచి మొదలు రానా వరకు అనేకమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అంతటి బ్యాగ్రౌండ్ ఉన్న నిర్మాత సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్ ను హీరో కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా రోజుల నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా కలిసి రావడం లేదు.

Read also : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు మంచి మంచి సినిమాలతో స్టార్ హోదాను సంపాదించే దిశలో ప్రయాణిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉన్నట్టుండి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ నటుడు మరి ఎవరో కాదు దగ్గుబాటి రాజా. ఒకప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా తమిళ, మలయాళ సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

read also : మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Daggubati Raja: అప్పటి ముచ్చట్లు: సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… ఈయన వెంకీ బంధువని తెలుసా?

రాజాకి, దగ్గుబాటి కుటుంబానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మూవీ మొగల్ రామానాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా…దర్శకుడు భారతి రాజా దగ్గర నటనలో శిక్షణ తీసుకొని హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం వంటి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ సినిమాలకు దూరమయ్యాడు. అయితే రాజాకు ఉన్న మొహమాటం వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అని అంటారు. ప్రస్తుతం వ్యాపారంలో రాణిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు రాజా.

Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Visitors Are Also Reading