వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా సీనియర్ బాలకృష్ణకు హనీ రోజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు హనీ రోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది. కాగా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిలో నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.
Advertisement
READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!
దానికి కారణం హనీ రోజ్ తన అందచందాలతో ప్రేక్షకులను మాయ చేయడమే. సినిమాలోనే కాకుండా సినిమా ఈవెంట్లలో హనీ రోజ్ సందడి చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా, ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్ కు వెళ్ళింది. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీరోజ్ ను అభిమానులు పెళ్లి గురించి అడిగారు. పెళ్లి ప్రశ్నలపై హనీ స్పందిస్తూ, పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత. ఆ బాధ్యతకు తను సిద్దంగా ఉన్నట్టు తెలిపింది.
Advertisement
READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!
వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితో పాటు నటనపై తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది. ఇక హనీ 2005లో బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ కొన్ని ఏళ్ల వరకు తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో కనిపించింది.
Advertisement
READ ALSO : IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్