Home » IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

by Bunty
Ad

టీమిండియా క్రికెట్ జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పడింది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Advertisement

అయితే… ఐపీఎల్ లో విజయవంతమైన జట్లలో ఒకటైన కోల్కతా నైట్ రైడర్స్ కు ఈ ఏడాది గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. అతను కనుక సర్జరీ చేయించుకుంటే వన్డే వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానమే. ఇలాంటి సమయంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై తెగ చర్చలు జరిగాయి. వీటిని కేకేఆర్ యాజమాన్యం తెరదించింది. శార్దూల్ ఠాగూర్, సునీల్ నరైన్, ఆండ్రి రస్సెల్ ఈ ముగ్గురు కేకేఆర్ లో చాలా కీలకమైన ఆటగాళ్లు.

Advertisement

 

ఈ క్రమంలో వీరిలో ఒకరికి జట్టు పగ్గాలు అందిస్తారని అంత అనుకున్నారు. అయితే ఈ ముగ్గురిని పక్కన పెట్టిన కేకేఆర్ ఎవరు ఊహించని విధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రానా ను కెప్టెన్ గా నియమించింది. ఈ నిర్ణయం అభిమానులకు చాలా షాక్ ఇచ్చింది. ఎవరు కూడా రానాకు కెప్టెన్సీ ఇస్తారని ఊహించలేదు. శార్దూల్ ఠాకూర్ ఈ ఏడాది కొత్తగా జట్టులో చేరినందుకే అతనికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. రానాకు కెప్టెన్సీ ఏం కొత్త కాదు. దేశ వాలిలో ఢిల్లీ తరఫున ఆడే సమయంలో రానాకు మొదటిసారి కెప్టెన్సీ అవకాశం దక్కింది. టీం ఇండియా మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ తర్వాత ఢిల్లీ జట్టుకు రానానే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.

READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

Visitors Are Also Reading