Home » నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన కొన్ని ఆరోగ్య సూత్రాలు…!

నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన కొన్ని ఆరోగ్య సూత్రాలు…!

by Bunty
Ad

ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో యవ్వనంగా కనిపించాలని వ్యాయామాలు, బ్యూటీ టిప్స్ వంటివి చేస్తూ ఉన్నారు. మనం ఇంట్లోనే కొన్ని నియమాలను పాటించి నిత్యం యవ్వనంగా ఉండవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం… రెండుపూటలా తినే సమయంలో పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు లేదా ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని త్రాగాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.

Advertisement

Advertisement

నిద్రలేచిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాలు యోగా లేదా వ్యాయామం వంటివి చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట ఒక ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే రోజుకి రెండు, మూడు లీటర్ల నీటిని త్రాగాలి. ఉదయం పూట నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలను రెండు లేదా మూడు తినడం వల్ల శరీరంలో కొవ్వు మొత్తం తగ్గిపోయి ఎముకలు దృఢంగా ఉంటాయి. నాడీ వ్యవస్థ బలంగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. రోజు రెండు అరటిపండ్లు తినడం వలన మంచి ఐరన్ లభిస్తుంది. అలాగే ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు. ప్రతిరోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్లు, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.

వారానికి ఒక రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. ఉపవాసం సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఉండకూడదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి కాస్త దూరంగా ఉండాలి. వీటన్నింటినీ పాటించినట్లయితే నిత్య యవ్వనంగా ఉంటారు.

Visitors Are Also Reading