Home » ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?

ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు.

Read Also :  తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?

Advertisement

ఇదే కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి ఇప్పుడు చాలామంది మరిచిపోయారు. అప్పట్లో వరుస సినిమాలు చేసిన ఆ హీరో ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇంతకు ఆయన ఎవరో కాదండోయ్.. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి.

కోటి రామకృష్ణ దర్శకత్వంలో 1986 లో వచ్చిన స్వాగతం చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. నందమూరి కళ్యాన్ చక్రవర్తి ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కుమారుడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి. ఏడాదిలో వరుసగా రెండు సినిమాలు.. ఆ తర్వాత నాలుగు అలా పెంచుకుంటూ బిజీ హీరోగా మారిపోయారు. అత్తగారు జిందాబాద్, అత్తగారు స్వాగతం, మామ కోడళ్ళ సవాలు, ఇంటి దొంగ, కృష్ణ లీల, అక్షింతలు, రౌడీ బాబాయ్, దొంగ కాపురం, లంకేశ్వరుడు వంటి సినిమాలలో నటించాడు కళ్యాణ్ చక్రవర్తి. ఆయన నటించినటువంటి సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇలా వరుస సినిమాలు చేసిన కళ్యాణ్ చక్రవర్తి.. 2003లో చివరిసారిగా కబీర్ దాస్ చిత్రంలో కనిపించారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Advertisement

Also Read :  తార‌క‌ర‌త్న పాన్ ఇండియా సినిమాను మిస్ చేసుకున్నాడ‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే…?

అందుకు కారణం కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు, కుమారుడు పృథ్వి అనే చెప్పవచ్చు. ఓ రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ చక్రవర్తి తన తమ్ముడు హరిన్ చక్రవర్తి, కొడుకు పృథ్వీ ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లు కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమారావు గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదము పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. దీంతో ఆయన నటనకు గుడ్ బాయ్ చెప్పి గాయపడిన తండ్రిని చూసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయారు కళ్యాణ్ చక్రవర్తి. తన తండ్రి మరణించిన తర్వాత కూడా చెన్నైని మాత్రం వదిలిపెట్టలేదు. వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయారు. అంత్యక్రియలకు కళ్యాణ్ చక్రవర్తి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ చక్రవర్తికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోయిన్ కచ్చితంగా అందుకు ఒప్పుకోవాల్సిందే..!

Visitors Are Also Reading