సౌత్ నుంచి నార్త్ వరకు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వారిలో ప్రభుదేవా ఒకరు. ముఖ్యంగా ఈయన ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు సంపాదించుకున్నారు. గత కొద్ది రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. తనకు అంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుని ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని వివాదాలతో అప్పట్లో వార్తల్లో నిలిచిన విషయం విధితమే.
Advertisement
Also Read : రెమ్యునరేషన్ పెంచేసిన యాంకర్ సుమ..ఏకంగా అంత డిమాండ్ చేస్తుందా..?
Ad
తొలి భార్యతో గొడవలు, విడాకుల తరువాత నయనతార ప్రేమలో పడటం.. పెళ్లి వరకు రావడం.. ఇక చివరి నిమిషంలో వీరు విడిపోవడం దేశవ్యాప్తంగా సంచలమైంది. ప్రభుదేవా జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి పెద్ద చేదు.. సంఘటనలుగా మిగిలాయి. వ్యక్తి గత కారణాలతో ఆయన సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. నయనతారతో పెళ్లి ఆగిపోయిన తరువాత 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఆయన హిమానీ సింగ్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఎక్కువగా బయట కనిపించలేదు. తాజాగా వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భార్య హిమానీ సింగ్ తో తిరుమలతో కనిపించారు.
Prabhudeva & his wife Dr Himani. pic.twitter.com/JdXvI03Yys
— Christopher Kanagaraj (@Chrissuccess) April 28, 2023
తన భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా నడుస్తున్న ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటారని చెప్పడం తెలుస్తోంది. ప్రభుదేవా రెండో భార్య హిమానీ ఎక్కువగా బయట కనిపించరు. అంతేకాదు.. ఆమె సోషల్ మీడియాలో ఉండరు. ఇదిలా ఉండగా.. ప్రభుదేవా చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రాన్ని తెరకెక్కించారు. తరువాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. గతంలో పలు ప్రాజెక్ట్స్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అవేవి సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రభుదేవా, హిమానీ సింగ్ పెళ్లి విషయం తొలుత ఆయన సోదరుడు రాజు సుందరం బయటపెట్టారు.
Advertisement