Home » రెమ్యున‌రేష‌న్ పెంచేసిన యాంక‌ర్ సుమ‌..ఏకంగా అంత డిమాండ్ చేస్తుందా..?

రెమ్యున‌రేష‌న్ పెంచేసిన యాంక‌ర్ సుమ‌..ఏకంగా అంత డిమాండ్ చేస్తుందా..?

by AJAY
Ad

టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరని అడిగితే ట‌క్కునే చెప్పే పేరు సుమ కన‌కాల‌. ప‌లు సూపర్ హిట్ టీవీ షో లకు సుమ యాంకర్ గా వ్య‌వ‌హ‌రించారు. ప్రస్తుతం యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో సైతం నటిస్తున్నారు. రీజెంట్ గా జ‌య‌మ్మ పంచాయితీ సినిమాలో న‌టించింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజ‌యం సాధించ‌లేదు. సుమ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది కానీ సక్సెస్ అవ్వ‌లేక‌పోయింది.

Advertisement

ఇక యాంక‌రింగ్ విష‌యానికి వ‌స్తే స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అంటే సుమ ఉండాల్సిందే. బేసిక్ గా మలయాళీ అయినప్పటికీ రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న తర్వాత సుమ తెలుగులో యాంకరింగ్ లోకి అడుగు పెట్టారు. యాంకరింగ్ లో త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

సినిమా ఫంక్ష‌న్ లో సుమ ఉందంటే ఆ ఫంక్ష‌న్ సంద‌డిగా ఉండాల్సిందే. అంతే కాకుండా సుమ పేల్చే జోకుల‌కు న‌వ్వులు పేలాల్సిందే. స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం సుమకు చాలా క్లోజ్ గా ఉంటారు. దాంతో ఆమె వారిపై సైతం పంచ్ లు వేస్తూ వారిని సైతం న‌వ్విస్తూ ఉంటుంది. ఇక ఫుల్ బిజీగా ఉండే సుమ త‌న టాలెంట్ కు త‌గిన‌ట్టుగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

సుమ ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్ష రూపాయల వరకు రెమ్యున‌రేషన్ తీసుకునే వారట. కానీ ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఫంక్ష‌న్ కే సుమ రెండు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇక‌ దానికి కారణం టీవీ షోలు మరియు ఈవెంట్ ల‌తో పాటూ సుమ‌కు సినిమా ఆఫ‌ర్ లు రావ‌డమేన‌ని టాక్.

Visitors Are Also Reading