Home » నోటిని ఉప్పు నీటితో పుక్కిలిస్తున్నారా ? లేదంటే వెంటనే మీరు ఇలా చేయండి..!

నోటిని ఉప్పు నీటితో పుక్కిలిస్తున్నారా ? లేదంటే వెంటనే మీరు ఇలా చేయండి..!

by Anji
Ad

ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు అందరినీ చుట్టుముడుతున్నాయి. సీజన్ లు మారుతున్న క్రమంలో ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్నో వేల ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే కానీ వాటి నుంచి పెద్దగా ఉపశమనం కలగదు. ఇలాంటి వ్యాధులు రావడానికి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణంలోని మార్పులు ఉద్యోగరీత్యా కొన్ని టెన్షన్స్ ఒత్తిడిలు, వల్ల ఇలా వ్యాధులకు గురవుతూ ఉంటారు. అటువంటి వ్యాధులు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న పదార్థాలతో వాటికి చెక్ పెట్టవచ్చు. కొన్ని సీజన్లు మారేటప్పుడు సహజంగా వర్షాలు వస్తుంటాయి. దీంతో జలుబులు, దగ్గు సమస్యలు చుట్టాల వస్తూ ఉంటాయి.

Advertisement

అతిగా ఇబ్బంది పెట్టి సమస్య గొంతు నొప్పి దానికోసం హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ గొంతు నొప్పి ని తగ్గించుకోవచ్చు. మనం వంటింట్లో ఉండే అధికంగా వినియోగించడం వలన ఎన్నో వ్యాధులు వస్తాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే నిర్ణీత పరిమాణంలో వాడితే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉప్పు నీటిని గొంతులో వేసుకొని బాగా పొక్కిలించడం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు గొంతు నొప్పి ఉన్న ఉప్పు మీరు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. కేవలం గొంతు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇలా చేయడం మంచిది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. గొంతులో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్ లు లాంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవుల భారీ నుంచి కాపాడుతుంది. ఆసిడ్స్ లెవెల్స్ ను తటస్థంగా ఉంచుతుంది.

Advertisement

Also Read :  స్కూటీ కోసం రూ.10 కాయిన్స్‌తో షోరూంకి చేరుకున్న యువ‌కుడు.. సిబ్బందికి చెమ‌ట‌లు..!

దీని ఫలితంగా పీహెచ్ లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది. ఇలా చేయడం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి నోరు దుర్వాసన లేకుండా ఉంటుంది. ఉప్పునీటిని పుక్కిలించడం వలన నోటిలో పుండ్లు, పొక్కులు, ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ఇలా ఈ విధంగా నిత్యం చేస్తే అవన్నీ తగ్గిపోయి నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు నిత్యం మూడుసార్లు ఈ ఉప్పునీటిని గొంతులో వేసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ళ నుంచి రక్తశ్రావం వాపు ఉన్నవారు అలాగే పంటి నొప్పితో ఇబ్బంది పడే వారికి గొప్ప ఉపయోగాలు కలుగుతాయి. బ్యాక్టీరియాలు, వైరస్ లు గొంతులో చేరడం వలన గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపుకి గురవుతూ ఉంటాయి. అప్పుడు ఆహారం తీసుకోవాలన్న ద్రవాలను తీసుకోవాలన్న చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉప్పు నీటిని గొంతులో వేసుకుని పుక్కిలించడం వలన ఈ ఇబ్బంది నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read :  తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి అసలు కారణం ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading