Home » స్కూటీ కోసం రూ.10 కాయిన్స్‌తో షోరూంకి చేరుకున్న యువ‌కుడు.. సిబ్బందికి చెమ‌ట‌లు..!

స్కూటీ కోసం రూ.10 కాయిన్స్‌తో షోరూంకి చేరుకున్న యువ‌కుడు.. సిబ్బందికి చెమ‌ట‌లు..!

by Anji
Ad

ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌పూర్‌లో నివాసం ఉండే ఓ యువ‌కుడు చినుకు చినుకు క‌లిసి వ‌ర‌ద‌గా మారి స‌ముద్రం నిండుతుంద‌నే సామెత‌ను కొంచెం సీరియ‌ర్ గానే తీసుకున్నాడు. నిజానికి ఈ యువకుడు రూ. 50 వేలతో స్కూటీ కొనడానికి వచ్చాడు. ఆ యువకుడు ఆ మొత్తాన్ని కౌంటర్ లో ఉంచడంతో షాపులోని సిబ్బందితో సహా అందరూ షాక్ తిన్నారు. మరి ఆ యువకుడు షాక్ కి తెచ్చింది. 10 నాణేలు. తాను పోగేసిన రూపాయలు 10 నాణేలతో స్కూటీ కొనేందుకు యువకుడు వచ్చాడు. స్కూటీ కొనేందుకు నాణేలన్నీ బ్యాగ్ లో నింపుకొని టీవీఎస్ డీలర్ షో రూమ్ కు యువకుడు చేరుకున్నాడు. ఆ తర్వాత ఈ 10 నాణేలతో స్కూటీ కొన్నాడు.

Also Read : స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా ?

Advertisement

manam

షోరూం ఉద్యోగులు నాణేల లెక్క పెట్టేందుకు చెమటలు కక్కారు అనుకోండి. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. జూపిటర్ స్కూటీని కొనుగోలు చేసేందుకు యువకుడు 50 వేల రూపాయలతో షో రూమ్ కు చేరుకున్నాడు. వీడియోలో ఒక వ్యక్తి ప్రశాంతంగా కుర్చీపై కూర్చున్నట్లు కనిపిస్తుండగా ఒక వ్యక్తి టేబుల్ పై నాణేలను లెక్కించడం కనిపిస్తుంది. రుద్రపూర్ లోని మమ్మీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ షోరూంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అక్కడ బైక్ కొనడానికి 50వేల రూపాయలు చెల్లించడానికి ఒక వ్యక్తి 10 రూపాయల నాణేలతో చేరుకున్నాడు. అప్పుడు షోరూమ్ ఉద్యోగులు కూడా తల పట్టుకున్నారు. అయితే షాప్ లోనే ఒక వ్యక్తి ఆ యువకుడి కోరిక. అతని కృషిని అతడు ఆ నాణేలను సేకరించడం కోసం పడిన కష్టాన్ని గౌరవించాడు. ప్రశాంతంగా ఆ నాణేలను లెక్కించడానికి కూర్చున్నాడు. కౌంటర్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి స్కూటీ ఇచ్చారు.

Advertisement

Also Read : తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి అసలు కారణం ఎంతో తెలుసా ?

manam

అయితే రుద్రపూర్ లో జూపిటర్ ఆన్- రోడ్ ధర రూ. 85210 ఉంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రూ.50వేలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఆ యువకుడు ఎలా చెల్లించాడు అనేది స్పష్టంగా లేదు. ఒక వ్యక్తి నాణెలను నింపి వేల‌ల్లో కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇంతకుముందు చాలా సార్లు ఇలా జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలతో పాటు ఇటీవల అస్సాంలో ఒక వ్యక్తి తన పొదుపు డబ్బును గోనె సంచిలో నింపి నాణేలను తీసుకొని స్కూటర్ కొనడానికి వచ్చాడు. అక్కడ ముగ్గురు- ముగ్గురు గోనె సంచిని ఎత్తుకొని మరీ షాప్ కు తీసుకున్న విష‌యం విధిత‌మే.

Also Read : ఈ ఆహార పదార్థాలతో కాలేయానికి చాలా ప్రమాదం.. జాగ్రత్త !

 

Visitors Are Also Reading