Home » హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !

హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !

by Bunty
Ad

నందమూరి తారక రామారావు… ఈ పేరు తెలియని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అస్సలు ఉండరు. టాలీవుడ్ స్టార్ హీరోగా మొదట్లో కెరీర్ ప్రారంభించిన నందమూరి తారకరామారావు… అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఎదిగారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో అన్ని కలిపి దాదాపు 450 సినిమాలకు పైగా నందమూరి తారకరామారావు నటించారు. 1982 మార్చి 29వ తేదీన… తెలుగుదేశం పార్టీ స్థాపించారు నందమూరి తారకరామారావు.

Advertisement

అయితే తెలుగుదేశం పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే… తన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు రామారావు. దీంతో అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం నందమూరి తారకరామారావు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. నిజంగా రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకువచ్చి పేదల కడుపునిండారు రామారావు. అలాగే తాలూకా వ్యవస్థను తీసేసి మండలాలు చేశారు. ముఖ్యంగా బీసీలకు న్యాయం చేసేలా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు రామారావు.

Advertisement

అయితే.. రామారావు ఉన్నంతవరకు ఆయన కొడుకు హరికృష్ణ… ఆయన వెంటే ఉండేవారు. ఆయన చేసినటువంటి మంచి పనులను దగ్గరుండి చూశారు హరికృష్ణ. అలాంటి హరికృష్ణ.. తన చివరి కోరిక తీరకుండానే చనిపోయారు. తాను చనిపోయే ముందు.. ఎలాగైనా తన నాన్నగారు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర గురించి, ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాల గురించి పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అనుకున్నారట హరికృష్ణ. అలా చేస్తే… భావితరాల విద్యార్థులకు కూడా నందమూరి తారకరామారావు పనితీరు గుర్తుంటుందని భావించారట హరికృష్ణ. కానీ ఆ కోరిక తీరకుండానే హరికృష్ణ మరణించారు. ఇప్పుడు ఆ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

Visitors Are Also Reading