Home » ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

by Bunty
Ad

టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ఇండియా మరియు పాకిస్తాన్ ఫ్యాన్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ జట్లకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ టోర్నమెంట్ లో మ్యాచ్ జరుగుతే ఆ రోజు అందరూ టీవీల ముందు కూర్చుని పోతారు. అయితే 2023 ఆసియా కప్ టోర్నమెంట్… వాస్తవానికి పాకిస్తాన్ దేశంలో జరగాల్సి ఉంది.

Advertisement

ఈ ఆసియా కప్ టోర్నమెంట్ లో.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కచ్చితంగా రెండు నుంచి మూడు మ్యాచ్లు ఉంటాయి. అయితే భద్రత దృష్ట్యా పాకిస్తాన్ వెళ్లేందుకు టీమిండియా, భారతదేశ ప్రభుత్వం అంగీకరం తెలుపడం లేదు. పాకిస్తాన్ మాత్రం… తమ దేశానికి రావాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. ఇలాంటి తరుణంలో రెండు దేశాల మధ్య చర్చలు ఇటీవల జరిగాయి. ఈ చర్చల ప్రకారం… పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాలలో ఆసియా కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. అంటే టీమిండియా ఆసియా కప్ లో ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే ఆడనుంది.

Advertisement

ఒకవేళ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఫైనల్ జరుగుతే కూడా… ఆ మ్యాచ్ శ్రీలంక లోనే నిర్వహిస్తారు. ఇక తాజాగా ఈ ఆసియా కప్ లో భాగంగా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ల వేదిక కూడా ఖరారు అయింది. రెండు జట్ల మధ్య ఆసియా కప్ 2023 లో ఎప్పుడు మ్యాచ్ జరిగిన దంబుల్లా వేదికగా జరగనుందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాదా ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. ఇక గ్రూప్ ఎ లో ఇండియా, పాక్ మరియు నేపాలు జట్లు ఉన్నాయి. ఇటు గ్రూప్ బి లో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading