Home » Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

by Bunty
Ad

ఆనంద్ దేవరకొండ గురించి తెలియని వారుండరు. అయితే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బేబీ’. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం నేషనల్ అవార్డు గెలిచిన కలర్ ఫోటో చిత్రానికి కథను అందించిన సాయి రాజేష్… బేబీ సినిమాకు డైరెక్షన్ చేశాడు. బేబీ చిత్రంలో నాగబాబు, లిరిష్, కుసుమ, సాత్విక్ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రముఖ డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.

Advertisement

కథ మరియు వివరణ : 

ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా కథ విషయానికి వస్తే… ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఓ ఆటో డ్రైవర్. తన బస్తీలో తన ఎదురింట్లో ఉండే వైష్ణవి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. మొదట వైష్ణవి టెన్త్ నుంచే ఆనంద్ తో ప్రేమలో పడిన అనంతరం ఆనంద్, వైష్ణవిని ఆమె కంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. ఆ తర్వాత వైష్ణవి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతుంది. కాలేజీలో ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ సమయంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆనంద్ ప్రేమ కథలో ఎలాంటి మలుపు చోటుచేసుకుంది? అలాగే వైష్ణవి జీవితం ఎలా సాగింది? మధ్యలో విరాజ్ పాత్ర ఏమిటి? చివరకు ఆనంద్ ప్రేమలో గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ. ఆ కథ తెలియాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే.

Advertisement

ప్రీ ఇంటర్వెల్ వరకు ‘బేబీ’ కథ నిదానంగా సాగుతుంది. పాఠశాలలో ప్రేమ కథ ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే మధ్యలో మంచి పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్ ఫ్లిక్ట్ మొదలైంది. ‘ప్రేమిస్తే’తో పాటు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు. అయితే… కథానాయికలో మానసిక సంఘర్షణ, నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…ఇద్దరితో వైష్ణవి చైతన్య సన్నివేశాలు ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో? అని ఆసక్తి రేపాయి. థియేటర్లలో ఆ సీన్లకు విజిల్స్, క్లాప్స్ పడటం గ్యారెంటీ. ఇంటర్వెల్ తర్వాత కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ
హీరో
హీరోయిన్లు
ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

రెగ్యులర్ సీన్స్
ఫస్ట్ హాఫ్
లవ్ సీన్స్

రేటింగ్ : 2.75/5

ఇవి కూడా చదవండి

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

Visitors Are Also Reading