Home » దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

by Bunty
Ad

టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో ప్రపంచ స్టార్ బ్యాటర్లందరినీ వనికించాడు ఈ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. 1990 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు అనిల్ కుంబ్లే. ఇక అప్పటినుంచి అతను రిటైర్ అయ్యేవరకు టీమిండియా జట్టుకు అనేక విజయాలను అందించాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున 132 టెస్టులు వాడిన అనిల్ కుంబ్లే… 619 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

అయితే తాజాగా… టీమిండియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య నిన్నటి నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2002 సంవత్సరం నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు ఈ స్టార్ బౌలర్ అనిల్ కుంబ్లే. అయితే… 2002 సంవత్సరంలో ఆంటీగ్వా టెస్ట్ సందర్భంగా వెస్టిండీస్ బౌలర్ షార్ట్ వేసిన బంతి కారణంగా… అనిల్ కుంబ్లే దవడ పలిగిపోయింది. ఈ గాయం కావడంతో… మ్యాచ్ కు పూర్తిగా అనిల్ కుంబ్లే దూరం కావలసి వచ్చింది.

Advertisement

అయితే ఆ మ్యాచ్ విరామ సమయంలో తన భార్యకు ఫోన్ చేసి… తాను ఇంటికి వస్తున్నానని, తన దవడకు సర్జరీ చేసుకోవాలని అనిల్ కుంబ్లే చెప్పాడట. అయితే ఆ విషయాన్ని తన భార్య కూడా నమ్మలేదట. జోక్ చేస్తున్నావా అని ఆమె పేర్కొందట. అయితే ఈ ఫోన్ కాల్ చేసిన తర్వాత… మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చాడు అనిల్ కుంబ్లే. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అనిల్ కుంబ్లే.. ఆ తర్వాత వెస్టిండీస్ డేంజర్ బ్యాట్స్మెన్ లారా వికెట్ తీశాడు. అతని వికెట్ పడ్డాక తిరిగి ఇండియాకు వచ్చేసాడు అనిల్ కుంబ్లే. ఇదే విషయాన్ని తాజాగా జియో సినిమాతో పేర్కొన్నాడు అనిల్ కుంబ్లే. కాగా 2002 సంవత్సరంలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading