Happy Ugadi Wishes Telugu 2023: సాధారణంగా భారతదేశ వ్యాప్తంగా ఉగాది పండుగ అని జరుపుకుంటారు. చాలా మంది ఉగాది పండుగ తెలుగు వారి పండుగ అంటుంటారు. కేవలం తెలుగు వారి పండుగ మాత్రమే కాదు ఉగాది. Ugadi 2023 పండుగను పలు రాష్ట్రాలలో పలు పేర్లతో పిలుస్తుంటారు. ఎవ్వరూ ఏ పేరుతో పిలిచినా సెలబ్రేషన్స్ మాత్రం అదురగొడుతుంటారు. పూర్వకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉగాది 2023పండుగ వచ్చిందంటే.. మట్టి ఇల్లును శుద్ధి చేసుకునేవారు. పుట్టమట్టితో ఇంటి గోడను మొత్తం పూసి.. ఆ తరువాత సున్నం Happy Ugadi 2023 వేసేవారు. ఇల్లు పండగ సందర్భంలో తలతల మెరిసిపోయేది. పండుగ వేళ బంధువులు, స్నేహితులతో సంబురంగా గడిపేవారు.
Advertisement
తెలుగు వారికి ఏ పండుగ అయినా ఒక అద్భుతం అనే చెప్పాలి. అందులో ఉగాది పండుగ ప్రత్యేకం. ఈ పండుగ రోజు మనం షడ్రుచులు కలిగినటువంటి పచ్చడిని తింటాం. అందులో తీపి (మధురం) , పులుపు (ఆమ్లం), చేదు (తిక్త), వగరు (కషాయం), ఉప్పు(లవణం), కారం(కటు) ప్రత్యేకం. ఇక మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, అన్నింటికీ ఆ పచ్చడి చాలా ప్రతీక అని చెప్పవచ్చు. సాధారణంగా తెలుగు నెల అయినటువంటి చైత్రమాసంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి.. తొలి పండుగగా తెలుగువారు పేర్కొంటారు. పండుగ సంతోషంగా జరుపుకుంటూ.. బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అందరూ చెప్పిన మాదిరిగానే మీరు కూడా మీ స్నేహితులకు, బంధువులకు Happy Ugadi Wishes Telugu చెప్పకుండా కాస్త భిన్నంగా శుభాకాంక్షలు, సందేశాలు పంపించండి ఇలా..!
Advertisement
Ugadi: 2023 Year Name
శ్రీ శోభకృత్ నామ సంవత్సర: Sree Shobakruth Nama Samvasthara
Happy Ugadi Wishes, Subhakanshalu, in Telugu: తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు 2023
- తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
- మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
- కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
- మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
- కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Happy Ugadi Images 2023