Sri Rama Navami 2023 Wishes, Quotes, Images, Greetings in Telugu: శ్రీరామనవమి పండుగ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీరామనవమి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు ఆస్వామి పుట్టిన రోజు చైతన్య శుద్ధ నవమి. శ్రీరామనవమి అనగా శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఆ రోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
Happy Sri Rama Navami 2023 Wishes, Quotes, Greetings, Images Telugu
భక్తులు ఎవరికి తోచినవిధంగా వారు పూజలు చేస్తుంటారు. ఉదయం వేళలో ఇండ్లను శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తారు. శ్రీరాముడికి పండ్లు, తులసి ఆకులను, పూలను, ప్రసాదాన్ని అర్పిస్తారు. ఉపవాసం చాలా మంది పాటిస్తారు. శ్రీరాముడికి హారతి ఇచ్చిన తరువాత రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామరక్ష స్తోత్రం వంటివి చదువుతారు. శ్రీరాముడు త్రేతాయుగంలో, చైత్రమాసం వసంత రుతువు శుద్ధ నవమి, గురువారం రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహానీయుడి జన్మదినంనే ప్రజలు పండుగగా జరుపుకుంటారు. Sri Rama Navami Date 2023 మార్చి 30 గురువారం రోజునే శ్రీరామనమి. శ్రీరాముడు పుట్టిన రోజు గురువారం, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా గురువారం రావడం గమనార్హం.
ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
Advertisement
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Sri Ramava Navami Wishes, Greetings, Quotes in Telugu 2023
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తూ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు! జై శ్రీరామ్