Home » రామబాణంతో గోపిచంద్ హిట్ సాధించినట్టేనా ?

రామబాణంతో గోపిచంద్ హిట్ సాధించినట్టేనా ?

by Anji
Ad

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ రామబాణం. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ మేకర్స్ తెగ చెబుతున్నారు. ప్రమోషన్లలో సమ్మర్ విజేత తమ రామబాణం అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

బాబోయ్ ఈ రేంజ్ నమ్మకం ఏంట్రా బాబు అంటూ అందదరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆకట్టుకునే కథ స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఉంటుంది. సినిమాపై అంచనాలు పెంచేవిధంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకి టైటిల్ ను పెట్టాడు అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు. డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించింది. తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. 

Also Read :  శరత్ బాబు ఆరోగ్యం పై వైద్యులు ఏమన్నారంటే ?

Advertisement

Manam News

తెలుగులో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపిచంద్ కి గడిచిన కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ అనేది లేదు. సక్సెస్ అనే పదాన్ని మరిచిపోయాడేమో అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి రామబాణం సినిమా గోపిచంద్ ను బయటికి తీసుకొస్తుందనే నమ్మకాన్ని కొందరూ వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందించిన రామబాణం మూవీ కనుక వసూళ్ల విషయంలో 25 కోట్లు చేరుకుంటే.. గోపిచంద్ కి మంచి కమర్షియల్ బ్రేక్ దక్కినట్టే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోపిచంద్ ఈ విషయంలో సక్సెస్ ఇచ్చేవిధంగా రామబాణం సఫలమవుతుందా లేదా అనేది వేచి చూడాలి. 

Also Read :   జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? డ‌బ్బు లేక‌పోవ‌డంతో చివరికి..!

Visitors Are Also Reading