Home » జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? డ‌బ్బు లేక‌పోవ‌డంతో చివరికి..!

జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? డ‌బ్బు లేక‌పోవ‌డంతో చివరికి..!

by AJAY
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న జబర్దస్త్ మహేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించిన మహేష్ … మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం మూవీలో ఒక అద్భుతమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించి ఆ తరువాత ఎన్నో క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నాడు.

Advertisement

 

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ సుమన్ టీవీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను మహేష్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ మాట్లాడుతూ … నేను మూవీలనే నమ్ముకున్నాను. నా ప్రయాణాన్ని జీరో తో మొదలుపెట్టాను. నేను సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో మా తండ్రి చనిపోయాడు.

Advertisement

ఆయన అంత్యక్రియలకు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఆ సమయంలో మా బంధువులు నీకు సినిమాలు అవసరమా అంటూ నన్ను తిట్టారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చాను. అందులో భాగంగా షకలక శంకర్ జబర్దస్త్ షో లో అవకాశం కల్పించాడు. 2011 వ సంవత్సరం నుండి దర్శకుడు సుకుమార్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఆ క్రమంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీలో అవకాశాన్ని కల్పించాడు. ఆ సినిమా ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు లభించింది అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా జబర్దస్త్ మహేష్ చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading