Home » బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్.. అదే వాస్తవం అవుతుందా ?

బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్.. అదే వాస్తవం అవుతుందా ?

by Anji
Ad

బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందంటే సంతోషపడే అభిమానులు షోకి శుభం కార్డు పడుతుందంటే మాత్రం ఫీలవుతుంటారు. అప్పుడే అయిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి మాత్రం హమ్మయ్య ఎట్టకేలకు ముగింపు కాబోతుందని ఊపిరిపీల్చుకుంటున్నారు జనాలు. ఈ సీజన్ అలా ఉంది మరి. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అని నాగ్ అన్నాడే తప్ప అంతగా చెప్పుకునే ఎంటర్ టైన్ మెంట్ లేదనే చెప్పవచ్చు. దీనికి తోడు బాగా ఆడుతున్నారనుకున్న కంటెస్టెంట్లను అన్యాయంగా ఎలిమినేట్ చేసి తమకు కావాల్సిన వాళ్లనే టాప్ 5లో పెట్టుకుంది బిగ్ బాస్ యాజమాన్యం అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

ముఖ్యంగా ఇనయా సుల్తాన ఎలిమినేట్ అయిన తరువాత 6వ సీజన్ పై మరింత విమర్శలు వచ్చిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీఆర్ఫీ కూడా పడిపోయింది. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ప్రస్తుతం ఇంట్లో ఆరుగురున్నారు. రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహా్, ఆదిరెడ్డి, శ్రీసత్య.. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ కాబోతున్నారు. మిగిలిన ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విన్నర్ ఎవరు అనేదానిపై జోరుగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తల్లి బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ విజేత ఎవరు అనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా నిలిచిన రోహిత్ విన్నర్ గా అవతరించనున్నాడని వెల్లడించింది. బిగ్ బాస్ 6 విన్నర్ ? బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ విజేత ఎవరు ? ఇలా ఎలా అడిగినా రోహిత్ పేరు సూచిస్తుంది గూగుల్. వాస్తవానికి అతడు టైటిల్ ని అందుకుంటాడేమో చూడాలి.  

Advertisement

Also Read :  పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. “వారాహి” రిజిస్ట్రేషన్ నెంబర్.. వైరలవుతోన్న వీడియో !

Manam News

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్6 ని పరిశీలించినట్టయితే..  ఓటింగ్ లో రేవంత్, శ్రీహాన్ తొలి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఆదిరెడ్డి, రోహిత్ కి కూడా బాగానే ఓట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. కీర్తి, శ్రీ సత్య ఓట్ల శాతంలో వెనుక పడినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో కి ముందు వరకు రోహిత్ పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. హౌస్ లో అడుగుపెట్టిన తరువాత తన మాటతో, ఆటతో, నిజాయితితో అభిమానులను సంపాదించుకున్నాడు. హౌస్ మేట్స్ తో , ప్రేక్షకులతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఆటలో మాత్రం మిగతా వారికంటే కొద్దిగా వెనుకబడడంతో ఓట్లలో కూడా వెనుకపడుతున్నాడు. ప్రస్తుతానికి రేవంత్ గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Also Read :   ట్రాన్స్​జెండర్​గా మారిన ఈ స్టార్ యాక్టర్​ ఎవరో గుర్తుపట్టారా..?

Visitors Are Also Reading