Home » పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. “వారాహి” రిజిస్ట్రేషన్ నెంబర్.. వైరలవుతోన్న వీడియో !

పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. “వారాహి” రిజిస్ట్రేషన్ నెంబర్.. వైరలవుతోన్న వీడియో !

by Bunty
Ad

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏపీ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఓ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికి ‘వారాహి’ అని పేరు కూడా పెట్టారు. అయితే బస్సు రంగు మాత్రం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధం అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రైవేట్ వాహనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ, రాసుకొస్తున్నారు.

READ ALSO : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

Advertisement


ఇలా చేయడం సరికాదని, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. ‘వారాహి’ కి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయని తేలింది. వారం క్రితమే వారాహి రిజిస్ట్రేషన్ అయ్యిందని, వాహన బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలించామని, తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్పష్టం చేశారు.

Advertisement

దీంతో మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న డైలాగ్ వార్ కు తెరపడింది. అయితే, ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అవ్వడంపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వారాహికి ‘TS 13 EX 8384’ అనే రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ప్రకటించింది. అలాగే వారాహి కలర్ ఆర్మీ వాళ్ళు వాడేది కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టిఏ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ కు సంబంధించి నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ వీడియోలో ఏముంది అని అంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫోన్ నెంబర్ చివరి 4 అంకెలు, వారాహి నెంబర్ ఒకటే అని వీడియో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading