Home » ఉపవాస సగ్గుబియ్యంను వేటితో.. ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ? 

ఉపవాస సగ్గుబియ్యంను వేటితో.. ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా విదేశాల్లో చాలా తక్కువగా.. భారతదేశంలో ఎక్కువగా వినియోగించే వాటిలో సగ్గుబియ్యం ఒకటి. వీటిని చాలా సేపు నానబెట్టిన తరువాత పాలలో ఉడికించి సూప్  మాదిరిగా తీసుకుంారు. సగ్గుబియ్యం భారతీయ జీవనవిధానంలో భాగం. అసలు ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయో చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. సగ్గుబియ్యం ఇండియా, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్, పపువా న్యూ గినియాలో కనిపించే ప్రత్యేక తాటి చెట్ల పిండి నుంచి తయారవుతుంది. 

Advertisement

సగ్గుబియ్యం చెట్టును మెట్రోజిలాన్ సాగు అని పిలుస్తుంారు. ఈ చెట్టు వేర్లకు ఉండే దుంపలను సేకరిస్తారు. చిలకడ దుంపల మాదిరిగానే ఉంటుంది. బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఆ దుంపలను ఓ యంత్రంలో వేసి బాగా కడుగుతారు. ఆ తరువాత ఈ దుంపల పై తొక్కని యంత్రాల ద్వారా తొలగిస్తారు. కొన్ని సాగు కర్మగారాలలో ఈ తొక్కను తొలగించే పనిని వర్కర్లు చేతులతోనే చేస్తున్నారు. తొక్క తీసేసిన తరువాత దుంపలను మళ్లీ నీటితో కడిగి పొడిలా చేస్తారు. ఈ సమయంలో వాటిలో ఉన్నటువంటి రసం బయటికి పోతుంది. తెల్లని పిండి వస్తుంది. 

Advertisement

Also Read :  మినపప్పు వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

ఈ పిండిలో స్టార్చ్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని తొలగించేందుకు మరోసారి నీటితో రిఫైండ్ చేస్తారు.  రిఫైండ్ చేసిన తరువాత తెల్లని పిండి పదార్థం మాత్రమే మిగులుతుంది. దానిని ఎండబెడుతారు. అలా ఎండకు ఎండిన పిండి పెద్ద పెద్ద గడ్డలుగా మారుతుంది. ఆ తెల్లని గడ్డలను మళ్లీ యంత్రాల్లో వేసి పొడిలా చేస్తారు. ఆ పొడిని సగ్గు బియ్యం ఆకారంలో మార్చడానికి సపరేట్ మిషన్ ఉంటుంది. దాని ద్వారా సగ్గు బియ్యాన్ని చిన్న చిన్న గోళాకారాలలో తయారు చేస్తారు. ఇలా తయారైనటువంటి సగ్గుబియ్యాన్ని భారతీయులు వినియోగిస్తారు. ఉపవాస సమయంలో ఈ సగ్గుబియ్యం శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. 

Also Read :   భోజనం తరువాత అరటిపండును తినవచ్చా..? తింటే ఏమవుతుందంటే..?

Visitors Are Also Reading