Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 కి సన్నద్ధమవుతున్న వారికి ఉచిత శిక్షణ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 కి సన్నద్ధమవుతున్న వారికి ఉచిత శిక్షణ

by Anji
Ad

తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వంటి పోస్టులతో పాటు తాజాగా గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత ఈ స్థాయిలో గ్రూప్-4లో పోస్టులు విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పలు విభాగాల్లో 9,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Advertisement

ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు త్వరలోనే రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ల దాఖలుకు జనవరి 12న చివరితేదీగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో పరీక్ష ఉండే అవకాశముంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859 వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862 పంచాయతీరాజ్ శాఖ లో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులున్నాయి. 

Advertisement

Also Read :  వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

Manam News

ఇదిలా ఉంటే.. భారీగా ఉద్యోగాల భర్తీకి జరుగనున్న నేపథ్యంలో గ్రూప్ -4 పరీక్షకు ప్రిపేర్ అవుతొన్న వారికి మంత్రి హరీష్ రావు శుభవార్త తెలిపారు. ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారికి ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు  సమాచారం. సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. ఈనెల 9 లోపు నిరుద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. కానిస్టేబుల్, గ్రూప్ 2, టెట్ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన విధంగానే శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని యువతి, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం 9030433459, 8555032916 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Also Read :  త‌ల్లి పాచిప‌నులు, ఆ రోజుల్లో ఆక‌లి బాధ‌లు…జ‌బ‌ర్ద‌స్త్ శాంతిస్వ‌రూప్ జీవితంలో ఇంత విషాదం ఉందా…?

Visitors Are Also Reading