Home » వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో ఫుల్ మాస్ మసాలాగా రాబోతున్నారు చిరు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో ఓ ట్రెండ్ సృష్టిస్తోంది. 

Manam News

Advertisement

ఇక ఈ చిత్రంలో రవితేజ, మెగాస్టార్ కలిసి నటిస్తుండడంతో మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకులు భావిస్తున్నారు. చాలా రోజుల తరువాత చిరు, రవితేజ కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగాఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు. డేట్ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ చిత్రం సంక్రాంతి మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం సంక్రాంతికి ఎప్పుడూ విడుదలవుతుందో తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. 

Advertisement

Also Read :  ప్ర‌తిరోజూ డ‌యాల‌సిస్, బైపాస్ త‌ర్వాత స‌ర్జ‌రీ..న‌టుడు చంద్ర‌మోహ‌న్ ఆరోగ్య‌ప‌రిస్థితి ఎలా ఉందంటే..?

అనుకున్నట్టుగానే ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో చిరు మాస్ లుక్ లో కనిపించారు. సముద్రం మధ్యలో బోట్ పై వేటకు వెళ్తున్న పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేవిధంగా ఉంది. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం విధితమే. అదేవిధంగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. 

Also Read :  అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి ఫోటోలు చూశారా ?

Visitors Are Also Reading