తెలంగాణలో ప్రభుత్వం నిరుద్యోగాలకు మరో శుభవార్త చెబుతోంది. ఇప్పటికే గ్రూపు-1, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రానుంది. దీని కోసం ఎంతో మంది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే గ్రూపు 4 ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి వాస్తవానికి ఇది ఓ శుభవార్తనే అని చెప్పాలి. పోస్టుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచుతోంది.
తెలంగాణలో 9,168 గ్రూపు-4 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటికి అదనంగా 700 పోస్టులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో గ్రూపు-4 మొత్తం పోస్టుల 9,800 దాటుతుందని సమాచారం. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్ -4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేసారు. అదనపు పోస్టులపై చర్చ కొనసాగుతుంది. అవసరం అయితే కొందరికీ ప్రమోషన్లు ఇచ్చి అయినా సరే పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్‌వోడీలు ఆదేశించారు.
Advertisement
Advertisement
మొత్తం 80వేల వరకు ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్ఎతున్నట్టు రెండు నెలల కిందటే సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇప్పటివరకు 39వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇందులో గ్రూపు-1, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వరుసగా నోటిఫికేషన్లు వచ్చినా నిరుద్యోగుల్లో రిక్రూట్‌మెంట్ ఫీలింగ్ కలగడం లేదని పోస్టుల సంఖ్య మరింతగా పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మే 29 కల్లా రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలను సిద్ధం చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదలకు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read :
ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!
సోషల్ మీడియాలో మోక్షాజ్ఞ ఫోటో.. కలవరపడుతున్న అభిమానులు..!